బహుభాషా గానకోయిల

  • 207 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చందలూరి నారాయణరావు

  • అద్దంకి

తన గానామృతంతో శ్రోతల్ని మైమరపింపజేసిన గాయనీమణి కె.రాణి. ఏడేళ్ల వయసులోనే నేపథ్యగాయనిగా సినీరంగంలో ప్రవేశించారు. తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలీ, సింహళ, ఉజ్బెక్‌ భాషల్లో వందలకొద్దీ పాటలు పాడారు. 
      రాణి అసలు పేరు ఉషారాణి. కర్ణాటకలోని తుముకూరు పట్టణంలో 1942లో జన్మించారు. తల్లిదండ్రులు లలిత, కిషన్‌. తండ్రి రైల్వే ఉద్యోగి. అలా ఆ కుటుంబం కడపలో స్థిరపడింది. రాణి చిన్నతనం నుంచే సంగీతంలో ప్రతిభ కనబరిచేవారు. 1951లో రూపవతి చిత్రం ద్వారా గాయనిగా అవకాశం పొందారు. 1953లో దేవదాసు చిత్రంలో ‘అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా’ పాట ద్వారా తెలుగువారికి సుపరిచితురాలయ్యారు. లవకుశలాంటి విజయవంతమైన చిత్రాల్లోనూ ఆవిడ పాటలు పాడి మెప్పించారు. పిల్లల పాటలు, సరదా పాటలు పాడటంలో రాణిది ప్రత్యేకశైలి. సింహళ భాషలో పట్టు సాధించి ‘సుసర్ల దక్షిణామూర్తి’ సంగీత సారథ్యంలో శ్రీలంక జాతీయగీతాన్ని ఆలపించారు. అప్పటి రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ సమక్షంలో ప్రదర్శన ఇచ్చి మెప్పించారు. కాంగ్రెస్‌ నేత ‘కె.కామరాజ్‌’ ఆమెను ‘మెల్లిసై రాణి’ అంటూ కీర్తించారు. సింహళ, ఉజ్జెక్‌ భాషలో పాటలు పాడిన తొలి భారతీయ గాయనిగా రాణి పేరొందారు. ఎన్నో సత్కారాలు అందుకున్నారు. 1966లో గాలివీటి సీతారామరెడ్డితో రాణి వివాహమైంది. ఈ దంపతులకు విజయ, కవిత ఇద్దరు కుమార్తెలు. అలనాటి మేటి గాయనిగా శ్రోతల మదిలో నిలిచిపోయిన కె.రాణి జులై 13న స్వర్గస్తులయ్యారు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం