తెలుగు వెంకన్న

  • 680 Views
  • 2Likes
  • Like
  • Article Share

సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ పొందిన ‘తెలుగు అక్షరాల వెంకన్న’ చిత్రం బ్రహ్మోత్సవాల సమయంలో విద్యుత్తు కాంతుల్లో ఇలా మెరిసిపోయింది. 
‘అక్షర జ్ఞాన ప్రదాత శ్రీవేంకటేశ్వరుడు’ పేరిట దాదాపు 40 అడుగుల కటౌట్‌ను తిరుమలలో తితిదే ఏర్పాటుచేసింది. ఎస్వీ మ్యూజియం చిత్రకారులు బత్తల ఆనంద్‌ ఈ చిత్ర రూపకర్త. ‘‘2012 తిరుపతి ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు విభిన్నంగా స్వామి చిత్రం గీద్దామన్న ఆలోచన వచ్చింది. అయితే, సభల సమయానికి దీన్ని పూర్తిచేయలేకపోయాను. తర్వాత కొద్దికాలానికి చిత్రానికి తుదిరూపునిచ్చాను. మ్యూజియం తరఫున దీన్ని ప్రదర్శించినప్పుడు జేఈవో శ్రీనివాసరాజు గారు మెచ్చుకున్నారు. స్వామివారే నాతో ఈ చిత్రం గీయించుకున్నారు’’ అని భక్తిపూర్వకంగా చెబుతారు ఆనంద్‌. 

- పొలుమూరు సింహాచలం, తిరుపతి 


వెనక్కి ...

మీ అభిప్రాయం