‘కాలం నా కంఠమాల’ అన్నదెవరు?

  • 1353 Views
  • 1Likes
  • Like
  • Article Share

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ డిసెంబరులో అధ్యాపక అర్హత పరీక్ష ‘నెట్‌’ నిర్వహించనుంది. ఇందులో ప్రతిభ చూపిన కొంతమందిని జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌లకు ఎంపిక చేస్తారు. వాళ్లకి ఫెలోషిప్‌ కింద మొదటి రెండేళ్లలో నెలకు రూ.25 వేలు, తర్వాత నెలకు రూ.28 వేల చొప్పున అందజేస్తారు. ఇతర సౌకర్యాలూ ఉంటాయి. అలాగే, అర్హత సాధించిన వాళ్లందరికీ ‘నెట్‌’ ధ్రువపత్రం ఇస్తారు. కీలకమైన ఈ పరీక్షకు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలను సాధన చేద్దాం.
(1) ‘పాకీపిల్ల’ ఖండకావ్యకర్త? (3)  
   1.జాషువా  2.గురజాడ  3.కరుణశ్రీ 4.దువ్వూరి రామిరెడ్డి
(2) ‘‘చావటానికి మా దగ్గరకు రాకండి. బతకటానికి నానా చావు చస్తున్నవాళ్లం’’ అన్న కవయిత్రి? (2)
   1.మహెజబీన్‌  2.ఓల్గా    3.విమల     4.జయప్రభ
(3) 2010 సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవల? (2)
   1. అంపశయ్య         2. కాలుతున్న పూలతోట    
   3. అసమర్థుని జీవయాత్ర 4. పాకుడురాళ్లు
(4) ‘నల్లద్రాక్ష పందిరి’ కర్త? (3)
   1.దేవీప్రియ        2.సతీష్‌ చందర్‌    
   3.ఎండ్లూరి సుధాకర్‌    4.కళ్యాణరావు
(5) ‘‘మనం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మనల్ని విభజించి పాలిస్తోంది’’ అన్న రచయిత్రి? (4)
   1.విమల  2.శిలాలోలిత     3.రేవతీదేవి  4.జయప్రభ
(6) ‘‘కాలం నా కంఠమాల’’ అన్నదెవరు? (4)
   1.శ్రీశ్రీ   2.గురజాడ     3.కుందుర్తి   4.దాశరథి
(7) ‘‘రవ్వలు రాల్చెదన్‌ గరగరల్‌ పచరించెద నాంధ్ర వాణికిన్‌’’ అన్న కవి? (3)
   1.బోయి భీమన్న     2.కుసుమ ధర్మన్న        
   3.గుర్రం జాషువా     4.గుంటూరు శేషేంద్రశర్మ
(8) ‘‘దోసమటం చెరిగియును దుందుడుకొప్పగ బెంచినారమీ మీసము’’ అన్నదెవరు? (4)    
   1.పింగళి- కాటూరి    2.వేంకటరామకృష్ణ కవులు    
   3.కొప్పరపు కవులు    4.తిరుపతి వేంకటకవులు
(9) ‘కావ్యాలంకార సంగ్రహం’ వ్యాఖ్యానకారుడు? (1)
   1.సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి    
   2.వేదం వెంకటరాయశాస్త్రి    
   3.మానవల్లి రామకృష్ణ కవి    4.దీపాల పిచ్చయ్యశాస్త్రి
(10) తొద, బ్రాహుయీ భాషల్లో లేనిది? (1)
   1.లింగభేదం        2.వచనభేదం    
   3.క్రియాభేదం        4.పురుషభేదం
(11) ‘త్రేతాగ్ని’ ఎవరి నవల? (1)
    1.అడవి సూర్యకుమారి        2.యద్దనపూడి    
    3.ఓల్గా    4.కుప్పిలి పద్మ
(12) ‘కనువినుకలి నెలవు పుట్టువు’ అంటే? (1)
   1.వాల్మీకి      2.వ్యాసుడు     
   3.ద్రోణుడు    4.భీష్ముడు
(13) ‘‘కృష్ణశాస్త్రిది సన్నాయి వాద్యమైతే, శ్రీశ్రీది డోలు వాద్యం’’ అన్నదెవరు? (4)
    1.చలం      2.విశ్వనాథ    
    3.కా.రా.       4.కొ.కు.
(14) మూలద్రావిడ భాషలో శ్వాసనాద వర్ణాలు రెండూ ఉన్నాయని చెప్పింది? (4)
    1.భద్రిరాజు    2.చేకూరి రామారావు
        3.టి.బరో   4.సునీల్‌కుమార్‌ ఛటర్జీ
(15) సవర భాష ఏ భాషా కుటుంబంలోది? (4)
    1.సైనోటిబెటన్‌ 
    2.ఇండో యూరోపియన్‌ 
    3.యూరల్‌ ఆల్టాయిక్‌    
    4.మలయో పొలినేషియన్‌
(16) ‘పల్లె పదాలు’ రచయిత? (3)
    1.ఉదయశ్రీ    2.ఉషశ్రీ     3.కృష్ణశ్రీ 4.కరుణశ్రీ
(17) తెలుగు కావ్యావతారికల్లో తొలుత స్వప్న వృత్తాంతాన్ని ప్రవేశపెట్టిన కవి? (2)
    1.నన్నయ    2.తిక్కన     3.పోతన     4.ఎర్రన
(18) సంస్కృత నాటకాన్ని తెలుగులో శ్రవ్యకావ్యంగా రాసిన తొలికవి? (3)
    1.తిక్కన 2.సూరన 3.మంచన 4.అనంతామాత్యుడు
(19) ఆధునిక భాషా శాస్త్రవేత్తల దృష్టిలో తెలుగులోని అచ్చులు? (3)
    1.10  2.12     3.14    4.16
(20) ప్రాచీనాంధ్ర శాసనాలలోని ‘అమ్మ’ అనే బంధువాచక పదం ఏ లింగ బోధకంగా చెప్పవచ్చు? (3)
    1.స్త్రీలింగం        2.నపుంసకలింగం    
    3.స్త్రీ పుం ఉభయలింగం    4.పుంలింగం
(21) ‘‘జానపదుల్‌ పురీజనులు’’ అన్న కవి? (4)
   1. నన్నెచోడుడు     2.నాచనసోమన  3.పోతన    4.ఎర్రన
(22) ‘తపుకు’ అనే పదం ఏ మాండలికంలో వాడుకలో ఉంది? (3) 
   1.కళింగాంధ్ర    2.రాయలసీమ 3.తెలంగాణ    4.కోస్తాంధ్ర
(23) ‘తైత్తరీయ సంహిత’కు భాష్యాన్ని రాసిందెవరు? (1)
   1.భట్టభాస్కరుడు    2.మల్లినాథసూరి    
   3.దివాకరుడు        4.గృహదేవుడు
(24) ‘ఎఱెకల్‌ ముత్తురాజు’ అనే పేరు కనిపించే తొలి శాసనం? (3)
    1.అద్దంకి 2.గూడూరు    3.ఎర్రగుడిపాడు 4.సాతులూరు
(25) కన్యకాపురాణ కథాగానం చేసేవారు? (2)
  1.ఆరెకాపులు 2.వీరముష్టులు 3.విప్రవినోదులు 4.శారదకాండ్రు
(26) ‘ర’ కారం? (1) 
    1.దంతమూలీయ తాడితం     2.దంత్యస్పర్శం    
    3. నాదతంత్రీయ స్పర్శం          4.దంతమూలీయ స్పర్శం
(27) తోటక రూపక భేదంగా చెప్పే కాళిదాసు రచన? (4)   
    1.రఘువంశం        2.అభిజ్ఞాన శాకుంతలం    
    3.మాళవికాగ్నిమిత్రమ్‌    4.విక్రమోర్వశీయం
(28) ‘సిరా’ ఏ భాష నుంచి వచ్చిన పదం? (1)
    1.తుర్కీ 2.డచ్‌  3.పోర్చుగీసు  4.హిందీ
(29) జానపద విజ్ఞానం పరిధిలో చేరని అనుకరణ ప్రక్రియ? (3)
    1.తోలుబొమ్మలాట 2.వీరగాథ 3.హరికథ 4.సామెత
(30) ‘రసం సామాజిక నిష్టం’ అన్న ఆలంకారికుడు? (3)
    1.ఆనందవర్ధనుడు    2.భట్టలోల్లటుడు    
    3.భట్టనాయకుడు    4.అభినవగుప్తుడు
(31) ‘ఆంధ్రలోకోక్తి చంద్రిక’ పేరుతో తెలుగు సామెతలను ప్రకటించిన ఆంగ్లేయుడు? (3)  
    1.రిచర్డ్‌ ఎం. డార్సన్‌    2.అలెన్‌డండస్‌    
    3.ఎం.డబ్ల్యు.కార్‌    4.స్టువర్ట్‌ జె.క్లాజ్‌
(32) ‘రావణ వధ’ కర్త? (3)  
    1.భవభూతి    2.విక్రమార్కుడు  3.భట్టికవి  4.బాణుడు
(33) మహాభారతంలో భగవద్గీత ఏ పర్వంలో ఉంది? (3)
    1.ఉద్యోగ 2.మౌసల  3.భీష్మ  4.స్వర్గారోహణ
(34) ‘రోలు’ అనే పదం ఏర్పడటానికి కారణం? (3)
    1.వర్ణనాశం        2.వర్ణవిభేదం    
    3.వర్ణవ్యత్యయం    4.వర్ణసమీకరణం
(35) ‘చివరి గుడిసె’ ఎవరి నవల? (2)    
    1.బోయ జంగయ్య 2.కేశవరెడ్డి 3.గోపీచంద్‌     4.బుచ్చిబాబు
(36) ‘కావ్యాదర్శం’ కర్త? (1)  
    1.దండి 2.మమ్మటుడు    3.భామహుడు  4.రుద్రటుడు
(37) రూపక భేదాలెన్ని? (4)
    1.4       2.8    3.9    4.10
(38) ‘అభ్యుదయ గీతాలు’ కృతి కర్త? (1)
    1.వట్టికొండ విశాలాక్ష్మి    2.వల్లంపాటి వెంకటసుబ్బయ్య    
    3.గరిమెళ్ల    4.శివసాగర్‌
(39) జానపద సాహిత్యంలో ‘మోటిఫ్‌’ అంటే? (4)
    1.జానపద గేయం         2.సామెత 
    3.ఆవృత్తి             4.కథనఘటకం
(40) తొలి తెలుగు ప్రజాకవి? (3)
    1.నన్నయ             2.వేమన 
    3.పాల్కురికి సోమన         4.తిక్కన
(41) పంచలక్షణాలు కలది? (3)   
    1.కావ్యం    2.ప్రబంధం 3.పురాణం  4.ద్విపద
(42) కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి ఏ ప్రక్రియకి పేరు పెట్టారు? (2) 
    1.కథ  2.నవల  3.ఏకాంకిక  4.వ్యాసం
(43) కథారహిత జానపద వాఙ్మయ శాఖకు చెందినవి? (4)
    1.పురాణకథలు    2.వీరగాథలు    
    3.నీతికథలు        4.పొడుపుకథలు
(44) జన్య జనక సంబంధం ఆధారంగా భాషల్ని వర్గీకరించే విధానం? (1)
    1.జాత్యాశ్రిత వర్గీకరణ        2.రూపాశ్రిత వర్గీకరణ
    3.భౌగోళిÚ¢ వర్గీకరణ        4.ఏదీకాదు
(45) దిగంబర కవులను ‘ఆగ్నేయ కవులు’ అని పిలిచినవారు? (4) 
    1.ఆరుద్ర        2.పఠాభి        
    3.చెరబండరాజు    4.నిఖిలేశ్వర్‌
(46) ‘కర్పూర వసంతరాయలు’ కావ్యకర్త? (4)
    1.కృష్ణశాస్త్రి    2.తిలక్‌    3.బాపురెడ్డి  4.సి.నారాయణరెడ్డి
(47) ‘సూతపురాణం’ ఏ వాదానికి చెందిన రచన? (4)
    1.స్త్రీ            2.మైనారిటీ    
    3.దళిత        4.హేతు
(48) ‘ఆంధ్ర భాషా వికాసం’ కర్త? (1)  
    1.గంటిజోగి సోమయాజి        2.భద్రిరాజు    
    3.పి.ఎస్‌.సుబ్రహ్మణ్యం        4.జి.ఎన్‌.రెడ్డి
(49) బాగ్స్‌ జానపద విజ్ఞాన వర్గీకరణలో ‘వి’ అనే ఆంగ్ల అక్షరం కింది ఏ గణాన్ని సూచిస్తుంది? (1)
    1.సామెత        2.జాతీయం    
    3.ప్రవేశిక        4.నమ్మకం
(50) ‘చిక్కనవుతున్న పాట’ ఏ వాదానికి సంబంధించిన కవితా సంకలనం? (1)
     1.దళిత    2.బీసీ    3.మైనారిటీ    4.స్త్రీ
 


వెనక్కి ...

మీ అభిప్రాయం