ఆంధ్రలో ప్రభుత్వ, జిల్లాపరిషత్, మండలపరిషత్, పురపాలిక, గిరిజన, బీసీ సంక్షేమశాఖ, ఆదర్శపాఠశాలలు వెరసి మొత్తం 7,729 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ జరగనుంది. పాఠశాల సహాయకులు, భాషాపండితులు, ఆదర్శపాఠశాలల్లో టీజీటీ, పీజీటీ తెలుగు నియామక పరీక్ష జరగబోతోంది. అభ్యర్థుల సాధన కోసం కొన్ని మాదిరి ప్రశ్నలివి..!
1. ‘అనుశీలన’ పేరుతో విమర్శక లక్షణాలు చెప్పిందెవరు? (3)
1) పింగళి 2) కోవెల సంపత్కుమారాచార్య 3) వడలి మందేశ్వరరావు 4) వల్లంపాటి వెంకటసుబ్బయ్య
2. ‘రింఛోళి’ వ్యాససంకలనం తెచ్చినవారు? (3)
1) శ్రీశ్రీ 2) కొడవటిగంటి 3) చే.రా 4) కె.వి.రమణారెడ్డి
3. ‘‘కన్యాశుల్కం నాటకం బీభత్సరస ప్రధానమైన విషాదాంత నాటకం’’ అని వ్యాఖ్యానించినవారు? (4)
1) అద్దేపల్లి 2) సర్దేశాయి తిరుమలరావు 3) రా.రా 4) శ్రీశ్రీ
4. ‘కమాను’ ఏ భాషాపదం? (3)
1) ఉర్దూ 2) అరబ్బీ 3) పోర్చుగీసు 4) తమిళం
5. ‘కవిరాజ శిఖామణి’ బిరుదాంకితులు? (3)
1) త్రిపురనేని 2) తుమ్మల 3) నన్నెచోడుడు 4) తిక్కన
6. ‘శుక్లపక్షం’ కర్త? (4)
1) చలం 2) అక్కిరాజు 3) శ్రీశ్రీ 4) అనంతపంతుల రామలింగస్వామి
7. ‘అర్థాపకర్ష ’ పొందిన పదం? (3)
1) వస్తాదు 2) సూది 3) కైంకర్యం 4) పెద్ద
8. ‘దక్కను కవుల చరిత్ర’ కర్త? (2)
1) సి.పి.బ్రౌన్ 2) కావలి రామస్వామి 3) శ్రీరామమూర్తి 4) కందుకూరి
9. కవులను ‘ప్రాచీన, మధ్య, ఆధునిక యుగ కవులు’గా విభజించిందెవరు? (3)
1) ఆరుద్ర 2) కోరాడ రామకృష్ణయ్య 3) కందుకూరి 4) ఖండవల్లి
10. ‘సాంఘిక నవల- కథన శిల్పం’ రచయిత? (2)
1) పి.సంజీవమ్మ 2) సి.మృణాళిని 3) ముదిగంటి సుజాతారెడ్డి 4) ఓల్గా
11. ‘గాలిరంగు’ కర్త? (1)
1) దేవిప్రియ 2) కమలాకాంత్ 3) పాపినేని 4) కొండేపూడి నిర్మల
12. ఒకే క్రియతో అన్వయించే నాలుగు పద్యాల రచన? (2)
1) కులకం 2) కలాపకం 3) యుగ్మకం 4) సందానితకం
13. ‘విద్వత్సంస్తవనీయ భవ్యకవితావేశుడు’ అని తిక్కన ఎవరి గురించి చెప్పాడు? (2)
1) వాల్మీకి 2) వ్యాసుడు 3) భారవి 4) కాళిదాసు
14. ఎర్రన హరివంశంలో లేని కథ? (4)
1) హంసడింభకోపాఖ్యానం 2) వజ్రనాభుని కథ 3) ప్రభావతీప్రద్యుమ్నం 4) అన్నీ
15. ‘శ్రీనాథుని కవితాసమీక్ష’ కర్త? (4)
1) ఈశ్వరదత్తు 2) చాగంటి శేషయ్య 3) వేటూరి 4) చిలుకూరి పాపయ్యశాస్త్రి
16. ‘భోజరాజీయం’లోని కథలెన్ని? (3)
1) 22 2) 32 3) 17 4) 37
17. రసచర్చ చేసిన మొదటి తెలుగు అలంకారశాస్త్ర గ్రంథం? (3)
1) రసాభరణం 2) కావ్యాలోకం 3) కావ్యాలంకారచూడామణి 4) కావ్యానందం
18. ‘మాణిక్యవీణ’ శీర్షికతో రచన చేసిందెవరు? (2)
1) సర్దేశాయి తిరుమలరావు 2) విద్వాన్ విశ్వం 3) బెళ్లూరి శ్రీనివాసమూర్తి 4) నాళం కృష్ణారావు
19. భగవద్గీతను ప్రత్యేకంగా తెలుగులోకి అనువదించిన తొలికవి? (2)
1) అన్నమయ్య 2) పెదతిరుమలాచార్యులు 3) చిన తిరుమలాచార్యులు 4) తిరువేంగళనాథుడు
20. ‘పద్య బసవపురాణం’ కర్త? (3)
1) పాల్కురికి సోమన 2) నాచన సోమన 3) పిడుపర్తి సోమన 4) చిన్నన్న
21. ‘నవచోళ చరిత్ర’ కర్త? (2)
1) కొలని గణపతిదేవుడు 2) పోశెట్టి లింగన 3) నిశ్శంక కొమ్మన 4) నాగలూరి శేషారాధ్యుడు
22. ‘శకుంతలా పరిణయం’ కర్త? (4)
1) తిరువేంగళనాథుడు 2) కూచిరాజు ఎర్రన 3) భైరవకవి 4) రేవణూరి వేంకటార్యుడు
23. ఆళ్వారుల్లో మహిళలు ఎందరు? (4)
1) ఇద్దరు 2) నలుగురు 3) ఆరుగురు 4) ఒక్కరు
24. ‘ఆముక్తమాల్యద పద్యాలోకనం’ కర్త? (2)
1) తుమ్మపూడి కోటేశ్వరరావు 2) వెల్దండ ప్రభాకరామాత్యుడు 3) దీపాల పిచ్చయశాస్త్రి 4) వేదం వేంకటరాయశాస్త్రి
25. ‘పరమయోగివిలాసం’ పద్యకావ్య కర్త? (1)
1) సిద్ధిరాజు అమ్మరాజు 2) గూడిపాటి వెంకటకవి 3) అనంతాచార్యులు 4) గరుడవాహన పండితుడు
26. పెద్దన సుదీర్ఘ ఉత్పలమాలను ఎన్ని పాదాలలో ఆశువుగా చెప్పాడు? (4)
1) 22 2) 26 3) 28 4) 30
27. ‘షట్చక్రవర్తి చరిత్ర’ కర్త? (3)
1) హరిభట్టు 2) సారంగు తమ్మయ్య 3) కామినేని మల్లారెడ్డి 4) చరిగొండ ధర్మన్న
28. శోకభయాదుల వల్ల కలిగే ధ్వని వికారం? (2)
1) మంజరి 2) కాకువు 3) అగూఢం 4) అపరాంగం
29. ‘గోరంతదీపాలు’ కథారచయిత? (1)
1) పులికంటి కృష్ణారెడ్డి 2) కేతు విశ్వనాథరెడ్డి 3) కె.సభా 4) మధురాంతకం రాజారాం
30. ‘మన్నారు దాసుడు’ అంటూ సమకాలీనులు ఎవరిని పిలిచారు? (2)
1) రఘునాథరాయలు 2) విజయ రాఘవనాయకుడు 3) శహాజీ 4) పురుషోత్తమ దీక్షితులు
31. శహాజీ ‘త్యాగరాజవినోద చిత్రప్రబంధ నాటకం’లో వాడిన భాష? (4)
1) సంస్కృతం 2) తెలుగు 3) మరాఠీ 4) పైవన్నీ
32. ‘శివకామ సుందరీ పరిణయం’ కర్త? (1)
1) తుక్కోజీ 2) వాసుదేవకవి 3) దర్బారాజగిరికవి 4) నివర్తి శేషాచలకవి
33. ‘ఆంధ్ర పాణిని’ బిరుదాంకితులు? (3)
1) అప్పకవి 2) నన్నయ 3) కేతన 4) నివర్తి శేషాచలకవి
34. ఇంగ్లీషులో స్వీయచరిత్ర రాసుకున్న తొలి తెలుగు వ్యక్తి? (3)
1) కందుకూరి 2) చిలకమర్తి 3) వెన్నెలకంటి సుబ్బారావు 4) శ్రీశ్రీ
35. ‘ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణం’ కర్త? (1)
1) పూదూరి సీతారామశాస్త్రి 2) చిన్నయసూరి 3) బహుజనపల్లి 4) అప్పకవి
36. బిందుపూర్వకాలైన య, ర, ల, వ, శ, ష, స, హలతో యతి చెల్లే వర్ణం? (4)
1) ఞ 2) ఙ 3) న 4) మ
37. మాత్రాగణ బద్ధమైన తాళలయా న్వితమై, గానాంశ ప్రాధాన్యం కలిగిన రచనలు? (3)
1) పద్యాలు 2) దండకం 3) గేయాలు 4) ఉదాహరణం
38. ‘ప్రాథమికోత్పాదకం’ను ఆంధ్ర వ్యాకరణంలో ఏమంటారు? (4)
1) తద్దితం 2) తత్సమం 3) ఆచ్ఛికం 4) కృదంతీకరణం
39. కళిక, ఉత్కళికలు తప్పనిసరిగా ఉండే కావ్యభేదం? (4)
1) ప్రబంధం 2) మంజరి 3) పర్యాయబంధం 4) ఉదాహరణం
40. కలవాడు, కలది అనే అర్థాన్నిచ్చేది? (3)
1) ఉత్తమం 2) ఉపధ 3) మతుబర్థం 4) పర్యుదాసం
41. ఉత్తరపదంతో నిషేధార్థం కలిగిన సంజ్ఞ? (1)
1) పర్యుదాసం 2) దఘ్నార్థం 3) ఉపధ 4) ఆచ్ఛికం
42. ‘మణిమాల’ ఎవరి రచన? (2)
1) గడియారం వేంకట శేషశాస్త్రి 2) వానమామలై వరదాచార్యులు 3) ఇంద్రగంటి 4) పింగళి- కాటూరి కవులు
43. ‘దృశ్య స్పష్టత, క్లుప్తమైన పద్యశరీరం, అనుభవప్రసారణం గల కవిత చిగిర్చే చెట్టు’ అన్న అనుభూతివాద కవి? (2)
1) తిలక్ 2) ఇస్మాయిల్ 3) ఇంద్రగంటి శ్రీకాంతశర్మ 4) గాలి నారసరెడ్డి
44. ‘పితౄణము’లోని సంధి? (3)
1) ఉకార 2) అకార 3) సవర్ణదీర్ఘ 4) వృద్ధి
45. ‘గంగా సంగమ మిచ్చగించునె’ అనే పద్యంలో తెనాలి రామకృష్ణకవి వర్ణించిన నది? (3)
1) పెన్న 2) కృష్ణ 3) తుంగభద్ర 4) గోదావరి
46. నపుంసక లింగంలో సమానమైన సంస్కృత శబ్దాలు? (3)
1) గ్రామ్యం 2) ప్రాకృత సమం 3) క్లీబతుల్యం 4) ఆచ్ఛికం
47. ‘మోట’ అనే అర్థంలో నెల్లూరు మాండలికంలో ఉన్న మాట? (4)
1) మడక 2) మదుం 3) మేడి 4) కపిల
48. సమాసరహితమైన గద్యం? (3)
1) వృత్తగంధి 2) ఉత్కళికాప్రాయం 3) చూర్ణకం 4) ముక్తకం
49. ‘అబార్షన్ స్టేట్మెంట్’ కవిత రాసిన వారు? (2)
1) ఘంటసాల నిర్మల 2) పాటిబండ్ల రజని 3) ఓల్గా 4) జయప్రభ
50. ‘పంచముడంటే ఐదోవేలు లేని వాడనేనా అర్థ’మని ప్రశ్నించిన కవి? (2)
1) ఎండ్లూరి సుధాకర్ 2) సతీష్‌చందర్ 3) శిఖామణి 4) శివసాగర్