కాలానికి ముందుమాట గురజాడ బాట
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
అమ్మ పలుకు చల్లన
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
అతిమధురం అన్నమయ్య పదం
డా।। కె.అరుణావ్యాస్
ఆముక్తమాల్యదలో వేసవి వెన్నెల
జూటూరు కృష్ణవేణి
ఆ తెలివి తెలుగుతోనే సాధ్యం
వై.తన్వి
ఎల్లలు దాటిన కోస్తాంధ్ర కథ
డా।। కాకుమాని శ్రీనివాసరావు
యెంకి చిలుక మనసె మనసు
‘‘నాకూ బసవరాజు అప్పారావుకూ నెయ్యిమేర్పడింది యెంకిపాటల కవి ద్వారా. సుబ్బారావూ నేనూ కాలేజీలో చదువుకునే వాళ్ళం... ‘ప్రేమకుంగల్గు కారణం బేమనగల?’ అంటూ అప్పారావు అలా పాడుతుండగానే అందుకునేవాడు సుబ్బారావు; రివ్వుమని తారాజువ్వలాగా గొంతు విసిరేవాడు. అప్పుడు నండూరి గొంతు కొండవాగు. పూర్తి పాఠం..
ఇళ్లలోన పండగంట.. కళ్లలోన కాంతులంట!!
డిసెంబరు నెల రాగానే క్రీస్తు విశ్వాసుల ఇంటింటా నక్షత్రాలు వెలుగుతాయి. చిమ్మ చీకట్లలో మిణుకు మిణుకుమంటూ కాంతులు విరజిమ్ముతాయి. మంచు దుప్పట్లను తొలగిస్తూ క్రిస్మస్ సంబరాలు మిన్నంటుతాయి. చక్కటి పాటలు పాడుతూ యేసు జన్మదిన వేడుకలు చేసుకుంటారు భక్తులు. పూర్తి పాఠం..
కోనేటిరాయణ్నే కొలుస్తూ... ఆయన ఊసులనే తన ఊపిరిగా మార్చుకుని బతికిన పరమభక్త శిఖామణి అన్నమయ్య. ఏడుకొండల వాడి పాదాలను పదాలతో అర్చించి తరించిన తాళ్లపాక ముద్దుబిడ్డ ఆయన. తెలుగు తీయదనాన్ని తన తలపులకు అద్ది అందమైన సంకీర్తనలను వెలయించిన వాగ్గేయకారుడు. పూర్తి పాఠం..
ఏడవకు ఏడవకు వెర్రినాగన్న
బాలసాహిత్యం ఒక కళా స్వరూపం. సంగీతంలా, చిత్రలేఖనంలా దాని సందేశం సౌందర్యయుతం, ఆనందమయం. బాలసాహిత్యంవల్ల విద్యాప్రయోజనాన్ని సాధించవచ్చు. దాని ఆశయం ఆనందమే అయినా, దాని గమ్యం జ్ఞాన ప్రధానం. పూర్తి పాఠం..
తెలుగులో నవల
ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో నవలది విశిష్ట స్థానం. ఇది వ్యక్తుల జీవితాన్ని ప్రధానంగా తీసుకుని సామాజిక జీవితాన్ని స్ఫురింపజేసే సాహిత్య ప్రక్రియ. బంకించంద్రుడు రాసిన ‘దుర్గేశనందిని’ భారతీయ సాహిత్యంలో తొలినవల. ఆంగ్లంలోని నావెల్ పదానికి తెలుగు సేత నవల. పూర్తి పాఠం..
వసంత ఋతువులో ఆమని అందాలేకాదు. వేసవిలో గ్రీష్మ ఋతు సోయగాలు సైతం కవుల హృదయాలను కదిలిస్తాయి. శీతకాలం మంచుతెమ్మెరలే కాక వేసవిలో ఎండమావులు సైతం వారి మనసులను రంజింపచేస్తాయి. మలయమారుతాలు, వడగాలులు సైతం కవులను స్పందింపజేస్తాయి. పూర్తి పాఠం..
కోస్తాంధ్ర కథ అంటే ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు కథా సాహిత్యం. అయితే ఈ ప్రాంతపు కథా రచయితలలో చాలా మందికి తాము ప్రత్యేకంగా కోస్తాంధ్ర తెలుగు కథ రాస్తున్నామనే స్పృహ లేదు. పూర్తి పాఠం..
ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా రాజకీయాల మీద, ఆ రంగంలోని వారి మీద దుమ్మెత్తి పోసేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. అలా రాజకీయరంగం ఎందుకు మాటపడాల్సి వస్తోంది? అంటే కచ్చితమైన సమాధానం ఒకటుంది. అదేమంటే రాజకీయరంగ ప్రవేశం చేయాలనుకొన్నవారు తెలుగు చదవటం లేదన్నదే. పూర్తి పాఠం..
సురాజ్యమా... నీవెక్కడ?
రాజకీయానికి రౌడీయిజం పెట్టే నెత్తుటి నైవేద్యం... అధికారం! రౌడీయిజానికి రాజకీయం ఇచ్చే బహుమానం... అమాయక జనం! అవిభక్త కవలలు ఆడే ఈ కత్తుల కోలాటంలో ప్రజాస్వామ్యం పగటికలవుతుంది. స్వతంత్ర భారతి దివ్య చరిత్రలో చాలాసార్లు అయింది కూడా! పూర్తి పాఠం..