ముఖపురాణం
టి.చంద్రశేఖరరెడ్డి
అమ్మభాషకు వరం అనంతపురం
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
పశ్చిమగోదావరి పలుకే బంగారం
ఎస్.ఆర్.భల్లం
మెతుకుసీమ మాట మధురం
డా।। గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
కడప గడపకు తెలుగు తోరణం
సి.శివారెడ్డి
పసిపాపగా అమ్మ
విజయబక్ష్
ముఖం మనసుకు అద్దం లాంటిది. వివిధ సందర్భాల్లో మనుషుల మనస్తత్వాన్ని వెల్లడిస్తుంది. ఎవరి ముఖాన్నైనా కాసేపు తేరిపార చూస్తే వాళ్ల మనఃస్థితిని పసిగట్టొచ్చు. అందుకే చాలామంది మాటవరసకి ‘ముఖం చూస్తేనే జాతకం చెప్పేయొచ్చు’ అంటారు. మనిషి మనసులో భావాల్ని వ్యక్తీకరించేది ముఖమేనంటారు మనస్తత్వ శాస్త్రజ్ఞులు. పూర్తి పాఠం..
ఏవండీ..! బాగున్నారాండి!! కొంపలో అంతా కులాసాయేనాండి!!! ఇలా వచ్చి, పెరట్లోకెళ్లి, రాతి గోళెం కాడ, మడాలు తడిసేటట్టు కాళ్లు కడుక్కోండి. టిపినీలు చేస్తారాండి.. ఏకంగా విస్తరేయమంటారాండి.. ఏవండీ, మిమ్మల్నేనండీ.. భోజనాల కాడ ఇంత మొగమాటం అయితే ఎలాగండి!? పూర్తి పాఠం..
రెండున్నర ఎకరాలకు మించి విస్తరించిన తిమ్మమ్మ మర్రిమాను ఉన్నా, కనుచూపుమేర పచ్చదనం కనిపించదు. చోళసముద్రం, నాగసముద్రం, రాయలచెరువు... ఊర్ల పేర్లలో చెరువులు, సముద్రాలకు కొదవలేకపోయినా, అక్కడ నీళ్లు పారేది మాత్రం మనుషుల కళ్లలోనే! పూర్తి పాఠం..
మేవూ...మా యెటకారమూ!
ఆయ్..మాది గోదారండీ.. మాక్కొంచెం యెటకారం ఎక్కువని అందరూ అంటారు గానండీ.. అది మాటలకేనండీ దానెనకతాల బోల్డంత మమకారం ఉంటదండీ బాబూ. అయినా మడిసికి మడిసి తగిలినప్పుడు ఆ మాత్రం సద్దాగా మాట్లాడుకోపోతే ఎలాగండే! పూర్తి పాఠం..
కథాకథనంలో ప్రపంచ ప్రఖ్యాతుడైన గుణాఢ్యుడి ‘బృహత్కథ’కు పరిచయమక్కర్లేదు. అంతటి కథక చక్రవర్తి కొంతకాలం మెదక్ జిల్లా కొండాపురంలో ఉన్నాడట! ఈ కొండాపురం శాతవాహనుల నగరం. ఇక్కడ జరిగిన తవ్వకాల్లో ఆనవాళ్లూ లభ్యమయ్యాయి. ఇప్పటికీ అవి స్థానిక పురావస్తు ప్రదర్శనశాలలో దర్శనమిస్తున్నాయి. పూర్తి పాఠం..
జంటపదాల కన్నులపంట!
తెలుగులోని జంటపదాలను వివరించబోతే ‘దారీతెన్నూ’ కనిపించదు! ఇక్కడ ‘దారి’ ఉన్నప్పటికీ ‘తెన్ను’ (దారి, మార్గం) ఎందుకొచ్చిందో! జంటపదాలతో వచ్చే చిక్కే ఇది. పూర్తి పాఠం..
మా రామసక్కని పలుకయ్యో!
ఇవాళ తెలంగాణ ఓ ప్రత్యేక రాష్ట్రం. దాదాపు కృష్ణా గోదావరుల మధ్య ఉన్న ఓ ప్రత్యేక ప్రాంతం. ఈ ప్రాంత ప్రజల భాషకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇతర తెలుగు ప్రాంతాల భాషతో పోల్చితే అవి విలక్షణమైనవి. పూర్తి పాఠం..
తెలుగు స్వతంత్ర భాష
ఒక్కొక్క చోట ప్రచలితం అయే కాకువూ, వొక్కొక్క చోట ప్రయుక్తం అయే యాసా పుస్తకాలు చదివితే అందవు, వొకచోట కూచున్నా దొరకవు- పల్లెలూ పట్నాలూ తిరగాలి, అష్టాదశవర్ణాల వారిలోనూ పరభాషా వ్యామోహం లేనివారిని కలుసుకోవాలి, ఆ పలుకుబళ్లు చెవులారా వినాలి, ఆ ప్రయోగవైచిత్రి సవిమర్శంగా పట్టుకోవాలి. పూర్తి పాఠం..
ఇలా రా... ఇదేరా ఇలారం!!
ట్రాక్టర్లు వచ్చాక నాగళ్లు తగ్గిపోయాయి. వ్యవసాయం యాంత్రీకరణ చెందాక మరెన్నో సంప్రదాయ పనిముట్లు మూలనపడ్డాయి. వాటితోపాటే వాటికి సంబంధించిన పదజాలమూ పక్కకెళ్లిపోయింది. ఇదంతా నాణానికి ఒకవైపు. అసలు ఈతరానికి మట్టితో అనుబంధం పలుచబడిపోతోంది. పూర్తి పాఠం..