ఆదివాసీ అక్షరానికి ‘అమ్మ’
బిల్లాడి భాస్కర్‌రెడ్డి
మక్కాలో మెరుస్తున్న తెలుగు ఖురాన్
ముహమ్మద్ ముజాహిద్
బర్మాలో తెలుగు ‘మూన్’
యర్ర నాయుడు
పరాయి పదాలతో పనేంటి?
ఆ భాషలూ నేర్చుకోండి
ఆరాటమంతా అమ్మభాష కోసమే!
అమ్మభాషకు అగ్రపూజ
తయారీ రంగంలో తిరుగులేని అభివృద్ధికి చిరునామా జర్మనీ. పాలిటెక్నిక్, వృత్తివిద్య, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నత విలువలతో కూడిన విద్యకూ ఈ దేశం పెట్టింది పేరు. అమ్మభాషలో చదువుల ద్వారానే పారిశ్రామిక ప్రగతిని సాధించిన జర్మనీ స్ఫూర్తి కథనమిది. పూర్తి పాఠం..
తెలుగు నేల నుంచి హజ్‌యాత్రకు వచ్చిన ముస్లింలకు సౌదీ ప్రభుత్వం ఎప్పుడూ ఆంగ్లం, అరబ్బీ, ఉర్దూ భాషల్లో ఉన్న ఖురాన్‌ను బహుమతిగా ఇచ్చేది. కానీ 2008లో అచ్చమైన తెలుగు ఖురాన్ ఇచ్చారు. దాన్ని చూసిన వారు మక్కాలో ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపడ్డారు. దీని వెనుక ఓ తెలుగు వైద్యుని పన్నెండేళ్ల కృషి ఉంది. పూర్తి పాఠం..
హైదరాబాద్ నుంచి 4143 కిలోమీటర్ల దూరంలోని మౌల్మీన్ నగరంలో వినిపించే ‘మూన్’ భాషకూ తెలుగుకు దగ్గరి పోలికలు కనిపిస్తాయి. తెలుగువారు మర్చిపోయిన ప్రాచీన తెలుగు పదాలెన్నో ఆ భాషీయుల నాలుకలపై నాట్యమాడుతుంటాయి. పూర్తి పాఠం..
సంస్కృతిలోనే సార్వభౌమత్వం
‘పితృభూమి (లేదా) మరణం- మనం గెలిచి తీరుతాం’... ఈ ఒక్క నినాదంతో క్యూబా విప్లవోద్యమాన్ని విజయతీరాలకు చేర్చిన నాయకుడు ఫైడెల్ కాస్ట్రో. క్రాంతిరథ సారథిగా దాదాపు అయిదు దశాబ్దాల పాటు దేశాన్ని నడిపించిన ఆయన ప్రస్థానమంతా ప్రజాబల సంపద్వంతమే. పూర్తి పాఠం..
వందకు పైగా భాషలు... ఒక్కటే యాప్!
ప్రపంచం ముందుకు సాగుతున్న కొద్దీకొన్ని భాషలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కారణాలు ఏవైనా అవి అంతరించే దశకు చేరుకుంటున్నాయి. కానీ, భాషఅంటే కేవలం భావాలనుపంచుకునే మాధ్యమం మాత్రమే కాదనీ... ప్రతిభాషా ఓ సంస్కృతికి ప్రతిబింబమనీ గుర్తించిన రోజున ప్రపంచంలోని ప్రతిభాషనూ కాపాడుకోవాలన్న ఆశయం పురుడుపోసుకుటుంది. పూర్తి పాఠం..
అగ్రరాజ్యంలో ఆదిమ ఘోష
అమెరికాను కొలంబస్ కనుగొని ఉండవచ్చుగాక! గానీ ఆ అమెరికాను సొంతం చేసుకునేందుకు ఐరోపా వాసులు చేసిన ప్రయత్నంలో, స్థానిక జాతులన్నీ ఇంచుమించుగా తుడిచిపెట్టుకుపోయాయి. వేల సంవత్సరాల నాటి ఆదిమజాతుల సంస్కృతి నేటికీ నామమాత్రంగా మిగిలిపోయింది. పూర్తి పాఠం..
ఘనాఘనుల భాష
ఇద్దరు తెలుగువాళ్లు కలిస్తే ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారన్న వెటకారం సామెతగా మారి చాలాకాలమే అయ్యింది. ఇక్కడే కాదు, ఆఫ్రికాలోని ఘనా పరిస్థితీ ఇదే. పూర్తి పాఠం..
వాలీద్వీపం తెలుసు కదా! అదే... ఇండోనేషియాలోని బాలి. జనాభా నలభైరెండు లక్షలకు కాస్త ఎక్కువ. వీళ్లలో 83.5 శాతం మంది హిందువులే. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియాలో ఏకైక హిందూ రాష్ట్రం (ప్రావిన్సు) బాలి. పూర్తి పాఠం..
ఒక వర్గంతో మమేకమవ్వాలంటే.. ఆ వర్గం భాషను నేర్చుకోవాలనేది ప్రాథమిక విషయం. ఈ సూత్రాన్ని ఆధునిక ప్రపంచ దిగ్గజమైన చైనా బలంగా విశ్వసిస్తోంది. అమలు చేస్తోంది. దేశ అధికారభాష ‘మాండరిన్’ను ప్రపంచవ్యాప్తం చేయడానికి తీవ్ర కృషి చేస్తున్న చైనా... పూర్తి పాఠం..