ఆహా! ఏమి రుచి!!
తెలుగు వెలుగు బృందం
తెలుగువాడి రుచి... చక్కని అభిరుచి
డాక్టర్ జి.వి.పూర్ణచందు
అంతర్జాలంలో అమ్మ చేతి వంట
మధురవాణి
పడిశం పదిరోగాలపెట్టు!
ఎ.సుబ్రహ్మణ్యం
సాహిత్య భోజనంబు... వింతైన వంటకంబు
పెదప్రోలు విజయసారథి
తినే బంగారం
తెలుగునాట సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది కృష్ణరాయల యుగం. ఆయన పాలనలో భువన విజయం అనే సాహితీసభ తెలుగు సాహిత్యానికి వెలుగుదివ్వెలను ప్రకాశింపజేసింది. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజకవులు వారి ప్రబంధాలతో ఆంధ్రభారతికి నవ్యశోభను చేకూర్చారు. ప్రాచీన కాలంలో పెళ్లిళ్లు ఏడు రోజులు కూడా చేసేవారు. పూర్తి పాఠం..
వహ్హారే! సంక్రాంతి భోజనంబు!!
ఏ యుగంలో అయినా ప్రజలు తమకి ఇష్టమైన వంటకాలనే వండి, అవి దేవుడికి ఇష్టమైనవని నైవేద్యం పెడుతుంటారు. వాటిని కవులు వర్ణిస్తారు. అవి ఆకాలపు ఆహార చరిత్రకు అద్దం పడతాయి. పూర్తి పాఠం..
తెలుగు వంటలు.. కరోనాకి కళ్లాలు
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమెందుకు? అలాగే, జబ్బులొచ్చాక ఆస్పత్రుల చుట్టూ తిరగడం కంటే అసలు ఏ వ్యాధులూ దరిజేరకుండా చూసుకోవడం ఉత్తమం కదా! ప్రపంచం మొత్తాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న కొవిడ్-19నూ కొన్ని ముందుజాగ్రత్తలతో అడ్డుకోవచ్చు. పూర్తి పాఠం..
తినకపోతే నీరసం, తింటే ఆయాసం... ఒడలు వడలిపోకూడదంటే తినకతప్పదు. అలా అని మోతాదు మించితే భుక్తాయాసంతో ఒళ్లు వంగదు. ఈ రెండు విషయాలనూ కలిపి నాలుగు పదాల్లో చెప్పేశారు మన పెద్దలు. ఇదే కాదు, ఆరోగ్యానికి సంబంధించిన లోతైన విషయాలెన్నింటికో సామెతల రూపమిచ్చి, ప్రజల నోళ్లలో నానేలా చేశారు. పూర్తి పాఠం..
మా వాడు ‘బంగారం’ అని ఓ అబ్బాయి గురించి కవిత్వం రాని తల్లిదండ్రులు చెప్పుకున్నా... ఓ యవ్వనవతిని ప్రాచీన కవి ‘పసిడి శలాక’ (బంగారు కడ్డీ) అని ప్రయోగించినా... బంగారం ఎప్పటికీ విలువైందే. కనకం, కాంచనం, సువర్ణం, హిరణ్యం, పసిడి... ఇలా మారుపేర్లు ఎన్ని ఉన్నా బంగారంపట్ల మగువలకు ఉండే ఆకర్షణ మాత్రం ఒక్కటే. పూర్తి పాఠం..
ఆహా!! నోరూరగాయానమః
తెలుగువారి వంటకాలన్నింటిలో ఊరించే ఊరగాయల రుచేవేరు. ఎర్రగా, వర్రగా, కంటికింపుగా ఊరిస్తూ నోటికి జివ్వుమనిపించే ఆవకాయ ఉంటే మిగతావన్ని దిగదుడుపే. ఈ మాట అబద్ధమని ఏ తెలుగువాడూ అనడు... అనలేడు కూడా! పూర్తి పాఠం..
పప్పన్నం పెడతారా?
వేడి మంగలములో వేయించి వేయించి గరగర విసిరిన కందిపప్పు సరిపడ్డ లవణంబు సంధించి వండిన కనకంబుతో సరి కందిపప్పు అన్నంబులో జొన్పి యాజ్యంబు బోసియు కల్పి మర్దించిన కందిపప్పు పట్టి ముద్దలు చేసి భక్షణ సేయంగ కడుపులో జొచ్చిన కందిపప్పు పూర్తి పాఠం..
ఎండల్లో చల్లగా!
‘ఎండాకాలంలో తరవాణీ కుండలోంచి చద్దన్నం దేవుకు తింటే కడుపులో ఎంతచల్లగానో వుంటుంది’... అంటారు తనికెళ్ల భరణి. నిజంగానే ‘చద్దన్నం మూట’ లాంటి మాట ఇది. ‘చల్లకొచ్చి ముంత దాచడమెందుకు’ గానీ నేరుగా విషయంలోకి వెళ్లిపోదాం! పూర్తి పాఠం..
రోటి పచ్చడీ అచ్చటా..ముచ్చటా...
దేవతల కోసం సురనీ, మానవుల కోసం పచ్చడినీ సృష్టికర్త సృష్టించాడని తెలుగువాడి నమ్మకం. అమ్మవారు ప్రత్యక్షమై, ఒక పాత్రలో పచ్చడినీ, ఇంకో పాత్రలో అమృతాన్ని చూపించి, ‘‘నరుడా! ఏది కావాలి...?’’ అనడిగితే పచ్చడినే కోరుకునేవాడు తెలుగువాడు! పూర్తి పాఠం..