ఇదీ తెలుగు కథాక్రమం
పత్రిక అంటే ఇదీ అదీ
నాటకానికి అడుగుజాడ కందుకూరి
డా।। కందిమళ్ల సాంబశివరావు
పద్యానికి పట్టం... పండరంగని శాసనం
తెలుగు వెలుగు బృందం
కరుణామయుడికి కావ్యార్చన
ఆచార్య ఫణీంద్ర
వెంకయ్య వెలిగించిన దీపం
మోదుగుల రవికృష్ణ,
పురాణ కథా పారిజాతం
‘‘మారన కథా విధానము జాఱలాడి/ కోరి శ్రీనాథు తెరువులు గొల్లగొట్టి/ మనుచరిత్రంబొనర్చి పెద్దన గడించె/ నాంధ్ర కవితా పితామహుడన్న బిరుదు’’ అని వెంకట రామకృష్ణకవులు సరదాగానే అన్నా ‘మనుచరిత్ర’కు మూలం మారన రచనే. అదే ‘మార్కండేయ పురాణం.’ తొలి తెలుగు పురాణంగా ఇది సుప్రసిద్ధం. పూర్తి పాఠం..
వాడెంత మాయగాడో!!
వాడే... వాడే... వాడే! వాడే మాయగాడు! అర్థమవుతోంది కానీ, వాణ్ని పట్టుకోవడమెలా? వేలు సందుల్లోంచి ఇసుక జారిపోయినట్టు జారుకునేవాడికి వలేసేదెలా? రంగస్థలం మీది పోలీసు బుర్రనే కాదు, ఎదురుగా కూర్చొని ‘వాడి’ వేషాలన్నీ చూస్తున్న ప్రేక్షకుల మెదళ్లనూ పరుగులెత్తించే ప్రశ్నలివి. పూర్తి పాఠం..
‘తొలి’ అంటే అదో గర్వకారణం. వెయ్యిమైళ్ల ప్రయాణానికీ తొలి అడుగే ప్రధానం. భాషా సాహిత్యాలకు సంబంధించి కూడా ఏది మొదటిది అనే చర్చ సహజంగా జరిగేదే. కాగితం కనిపెట్టని కాలంలో మానవుడు తన భావాలను, ప్రకటనల్ని శాశ్వతం చేయడానికి శిలలను ఉపయోగించాడు. వీటినే శిలా శాసనాలు అంటున్నాం. పూర్తి పాఠం..
తెలుగులో భక్తి సాహిత్యం అనగానే అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు తదితర వాగ్గేయకారులు, వారు రచించిన రమణీయమైన కీర్తనలే జ్ఞప్తికివస్తాయి. 19వ శతాబ్దిలో ఒక వాగ్గేయకారుడు తన కమనీయ కీర్తనలతో క్రీస్తును ఆరాధించి, క్రైస్తవ మతానుయాయులను అలరించిన విషయం కొద్దిమందికే తెలుసు. పూర్తి పాఠం..
ఆ మంత్రం వందేమాతరం
భారతదేశ చరిత్రలో మహోజ్వల స్ఫూర్తిదాయక ఘట్టం జాతీయోద్యమం. 1857లో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం విఫలమైన తర్వాత బ్రిటిష్వాళ్లకు వ్యతిరేకంగా దేశమంతా ఏకమైంది. దీన్ని సహించని ఆంగ్లపాలకులు భారతీయుల మధ్య విషబీజాలు నాటేందుకు విభజించి పాలించేందుకు సిద్ధపడ్డారు. పూర్తి పాఠం..
దండక కావ్యాల శ్రేణి భోగినీ దండకం బోణి
శతకం తర్వాత తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సాహితీ ప్రక్రియ ‘దండకం’. దాని పేరు చెప్పగానే ‘శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం... నమస్తే నమస్తే నమః’ అనే ప్రఖ్యాత ఆంజనేయ దండకం గుర్తుకొస్తుంది. పూర్తి పాఠం..
నాయమేటికి దప్పితివి రఘునాథా?
తెలుగులో ‘సౌభరి చరిత్రము’ను తొలి యక్షగానంగా పేర్కొంటారు. రచించింది ప్రోలుగంటి చెన్నశౌరి. కానీ ఇప్పుడిది అలభ్యం. ఇక దొరుకుతున్న వాటిలో ముందువరసలో నిలిచేది ‘సుగ్రీవ విజయం’. దీన్ని క్రీ.శ.1550 కాలానికి చెందిన కందుకూరి రుద్రకవి రచించాడు. పూర్తి పాఠం..
నారసింహ క్షేత్ర కీర్తి
నృసింహపురాణంలో వీర రౌద్ర భయానక శృంగార కరుణ భక్తి రసాలు కనిపించినా అంగిరసం మాత్రం శాంతమని విమర్శకులు పేర్కొన్నారు. అహోబలేశుడి ఖ్యాతిని వివరిస్తూ వచ్చిన ఈ రమణీయ గ్రంథం తర్వాతి కాలంలో అనేక స్థలపురాణాలకు స్ఫూర్తిగా నిలిచింది. పూర్తి పాఠం..
చదువుతున్నప్పుడు ఏదైనా తెలియని పదం తారసపడితే వెంటనే అర్థం తెలుసుకునేందుకు ఉపకరించేవి నిఘంటువులు. తెలుగులోనూ మనకు తెలియనివి లక్షల పదాలు ఉంటాయి. వాటి అర్థాలు తెలుసుకునేందుకు పూర్వం పద్య నిఘంటువులు ఉండేవి. పూర్తి పాఠం..