భావ దీపావళి
ఉగాది విజయం
డా।। అనంతలక్ష్మి
ఉగాది ఊసులు
కొలనుపాక మురళీధరరావు
సంస్కృతి నిండుగా... దసరా పండుగ
ఓలేటి శ్రీనివాసభాను
బంగారు బతుకమ్మ...ఉయ్యాలో
దుర్గం రవీందర్
అట్లుపోయంగా... ఆరగించంగా
డా।। యల్లాప్రగడ మల్లికార్జునరావు
డాక్టర్ గణపయ్య!!
నమ్ముకున్న వారి దోషాలను హరించేవాడు, శరణు కోరిన వారిని సంతోషపెట్టేవాడు, విఘ్నాలను తొలగించేవాడు, అశేష ప్రజావాహినికి ఆనందం కలిగించేవాడైన ఆ పార్వతీ తనయుడు, ఆ మోదక ప్రియుడు, ఆ మూషిక వాహనుడికి మొక్కుతున్నాను అన్నాడు పోతన. ఆయన ఒక్కడేనా... పూర్తి పాఠం..
రాఖీ... బంధం
అన్నయ్యా రాఖీ కడతాను చెయ్యి పట్టు... అంటూ పరుగున వచ్చింది లీల. నాకొద్దు చెల్లీ నా స్నేహితులంతా ఏంటా తాళ్లని నవ్వుతారు అంటూ చెయ్యి దాచేసుకున్నాడు రాము. అదేంట్రా రామూ చెల్లి అంత ప్రేమగా రాఖీ తెస్తే కట్టించుకోవేం. అసలు రాఖీ విలువ తెలిస్తే నువ్వలా వద్దనవు తెలుసా! పూర్తి పాఠం..
గురువే మిన్న
ఓసారి కబీరుదాసును ఒక భక్తుడు ‘మీకు గురువు, శ్రీమన్నారాయణుడు ఒకేసారి ప్రత్యక్షమైతే ముందుగా ఎవరికి నమస్కరిస్తారు’ అని ప్రశ్నించాడు. దానికి కబీరు ‘గురువుకే నమస్కరిస్తా. ఎందుకంటే, గురువు ద్వారానే శ్రీమన్నారాయణుణ్ని తెలుసుకున్నా కాబట్టి’ అన్నాడు. పూర్తి పాఠం..
ఉగాది జ్ఞాపకాలు...
వికారి నామ సంవత్సర ఉగాది, శ్రీరామనవమి శుభాకాంక్షలు. సుఖదుఃఖాల కలనేత అయిన జీవిత ప్రయాణంలో మరోమజిలీగా ఈ నవ వసంతాన్ని ఆహ్వానిస్తూ మన చలనచిత్ర గీత, మాటల రచయితల్లో కొందరు పంచుకున్న ఉగాది మధుర జ్ఞాపకాలు ఇవి. పూర్తి పాఠం..
స్వామియే శరణం అయ్యప్పా!
మన రెండు రాష్ట్రాల నుంచి ఏటా 80 లక్షల మందికి పైగా మాలధారులు శబరిమల యాత్ర చేస్తారని అంచనా! అందుకే కార్తీకంతో ప్రారంభించి మార్గశిరం మీదుగా పుష్య మాసం వరకూ తెలుగునాడంతా శరణుఘోషతో మారుమోగుతుంటుంది. పూర్తి పాఠం..
మన ఘన సంస్కృతిని నిండా ప్రతిబింబించేవి మన పండుగలు. అందులోనూ వెలుగుల విందులు చేసేది దీపావళి. కాల్చేవీ, పేల్చేవి ఎన్ని ఉన్నా రకరకాల దీపాల వరుసలు చూడటమే కళ్లకు వేడుక. అసలు దీపా‘వళి’ అంటేనే దివ్వెల వరుస. పూర్తి పాఠం..
షడ్రుచుల సమ్మేళనం తెలుగు భాష. సమష్టి భావాల సమాగమం తెలుగు సంస్కృతి. ఆరు రుచుల్లోని అంతరార్థాన్ని జీవితానికి అన్వయించుకుని, షడ్గుణాలకు అతీతంగా తోటి వారితో కలిసి నడవమని ఉద్బోధించేది తెలుగు ఉగాది. మన వారసత్వం ఘనం. మన సంప్రదాయం సమున్నతం. పూర్తి పాఠం..
సంతోషాలు నిండగా... ఆడి పాడే పండుగ
బతుకుబాటలో తమతో కలిసి ప్రయాణిస్తూ, తమకు నిస్వార్థంగా సేవ చేసే మూగజీవాలకు జాసపదులు మనసారా కృతజ్ఞతలు తెలిపే వేడుక... సంక్రాంతి. పూర్తి పాఠం..
శ్రమిస్తూ సేదదీరడం, విరామంలో వినోదాన్ని ఆస్వాదించడం, వ్యవసాయం జీవనాధారమైన ఏ దేశంలోనైనా ఇదే పండుగల పరమార్థం! పేరులో సరదాను స్ఫురించే దసరా- ‘‘పనిచేసేవారి కోసమే పండుగ’’ అని చాటి చెబుతుంది! పూర్తి పాఠం..