ముఖపురాణం
టి.చంద్రశేఖరరెడ్డి
అమ్మభాషకు వరం అనంతపురం
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
పశ్చిమగోదావరి పలుకే బంగారం
ఎస్.ఆర్.భల్లం
మెతుకుసీమ మాట మధురం
డా।। గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
కడప గడపకు తెలుగు తోరణం
సి.శివారెడ్డి
పసిపాపగా అమ్మ
విజయబక్ష్
రాగాలరాయి సిబ్బె... చిప్పకట్టె
గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్ అన్నాడు నన్నయ్య. మానవ చారిత్రక గమనంలో గతానికి ఉన్న ప్రాధాన్యం విస్మరించలేనిది. సంస్కృతి, సంప్రదాయాలు, పూర్వికుల జీవన విధానం గురించి తెలుసుకోవడానికి ఆ గతమే మూలం. అందులోకి ఒక్కసారి దృష్టిసారిస్తే వాళ్ల సృజనాత్మకతకు అద్దం పట్టే అపురూప వస్తుజాలం కనిపిస్తుంది. పూర్తి పాఠం..
ఎన్నబా ఎన్న సమాచారం?
ఏంబా మలైకు పోయినావా?... చెప్పండి! చిత్తూరు సోదరులు అడుగుతున్నారు ‘మీరు తిరుమలకు వెళ్లారా? లేదా?’ అని! ఆయన ఇప్పుడదా పూడ్సినాడు... ఇదీ ఆ జిల్లా మాటే. అర్థం... ‘ఆయన ఇప్పుడే వెళ్లాడు’! ‘గోల గోవిందరాజులుది ముడుపులు వెంకటేశులువి’... ఈ సామెత వెనక కథ కూడా ఆ జిల్లాకే సొంతం. పూర్తి పాఠం..
బేగి ఎలిపొచ్చీ...!
సాహిత్యం... సంగీతం... విజయనగరం! ఈ మూడింటిని వేర్వేరుగా చూడలేం. ఒకరా ఇద్దరా... గురజాడ, గణపతిముని, ఆదిభట్ల, వంగపండు... ఎందరెందరు కవులు, కళాకారులు! ద్వారం, ఘంటసాల, సాలూరి, సుశీల... మరెందరెందరు సుస్వరాల సమ్రాట్టులు! పూర్తి పాఠం..
ఏదో సామెత చెప్పినట్లు!
తెలుగువారికి గారెలంటే ఎంత ఇష్టమో. భారతమన్నా అంతే ఇష్టం. అందుకే ‘తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి’ అన్నారు. ఆ రోజుల్లో ఎంత ఇష్టంగా గారెలు తినేవారంటే, చివరికి ఎక్కువైపోయి ‘తినగ తినగ గారెలు చేదు’ అనటం మొదలుపెట్టేవారు. పూర్తి పాఠం..
మరుగవుతున్న మాణిక్యాలు
కాలం గడిచే కొద్దీ పాతవి కొన్ని మరుగున పడిపోతుంటాయి. అలానే కొత్తవీ మన జీవితాల్లో భాగమైపోతుంటాయి. ఇవి సహజంగా జరిగేవే. భాష కూడా దీనికి అతీతమేమీ కాదు. ఒకప్పటి తెలుగు వాడుక భాషతో పోలిస్తే... ఇప్పటి తెలుగులో ఆంగ్లం ప్రభావం ఎక్కువ. ఫలితంగా మనవైన కొన్ని పదాలు వాడుకలోంచి కనుమరుగవుతున్నాయి. పూర్తి పాఠం..
గుంటూరు తెలుగు తేనెలూరు
కారంపూడిలో కలియదిరిగిన పాతరాతి యుగపు మానవుడు... భట్టిప్రోలులో రాజ్య పతాకాన్ని ఎగరేసిన యశోధరుడు... చరిత్ర గుర్తులెన్నో! పౌరుషానికి ప్రాణం పెట్టే పల్నాడు... కళల కాణాచి తెనాలి... విస్మరించలేని ఊళ్లెన్నో! సిరుల వరాలనిచ్చే వరి... ఘాటెక్కించే మిరప... దుగ్గిరాల పసుపు... పలకరించే పైరులెన్నో! పూర్తి పాఠం..
మాండలికంపై మనసు పారేసుకుని...
‘ఎంకివంటి పిల్ల లేదోయి లేదోయి...’ అంటూ ఎదను గిల్లే ఎంకి పాటలను విన్నాం. చదివాం. బంగారిమామ, కిన్నెరసాని, కూనలమ్మ... మొదలైనవీ మనకు తెలుసు! వీటిలో గణాలు, యతులు లాంటి ఛందస్సు ఛాయలు లేవు. అయితే ఇవి పాటలు. పూర్తి పాఠం..
వెటకారాల దారిలో గోదారి
‘‘గోదారి జిల్లా వోళ్లు సామాన్యులు కారొరోయ్! ఆళ్ల మాటల్లో మమకారం, చమత్కారం, ఎటకారమే కాదు, ఆ మాటకొస్తే కాసింత సూరేకారం కూడా కలగలిసుంటాదని అందరనుకుంటారహే’’ అని గోదారోళ్లే అనేసుకోడం కూడా కద్దు. ఆ ఊసులెలాఉన్నా గోదారి జిల్లావోళ్లు పరమ లౌక్యులన్న అభిప్రాయం లోకంలో ఎందుకో మరి స్థిరపడిపోయింది. పూర్తి పాఠం..
‘ఉప’యను రెండక్షరాలు
ఉపకారం, ఉపవాసం, ఉపాఖ్యానం, ఉపాయం, ఉపధ, ఉపమానం, ఉపాధ్యాయుడు, ఉపదేశం, ఉపరాష్ట్రపతి ఇలా ఎన్నో పదాల్లో ముందు వరుసలో కూర్చుంటుంది. వ్యాకరణ, సాహిత్య, ఆధ్యాత్మిక, రాజకీయాలు... ఇలా ఏ రంగమైనా సరే ‘ఉప’అనే రెండక్షరాలు దర్శనమిస్తూనే ఉంటాయి. పూర్తి పాఠం..