ఆదివాసీ అక్షరానికి ‘అమ్మ’
బిల్లాడి భాస్కర్‌రెడ్డి
మక్కాలో మెరుస్తున్న తెలుగు ఖురాన్
ముహమ్మద్ ముజాహిద్
బర్మాలో తెలుగు ‘మూన్’
యర్ర నాయుడు
పరాయి పదాలతో పనేంటి?
ఆ భాషలూ నేర్చుకోండి
ఆరాటమంతా అమ్మభాష కోసమే!
సొంత భాషలోకి పరాయి భాషా పదాలను తెచ్చుకోవడమెందుకని ఓ దేశాధ్యక్షుడే ప్రశ్నించారు. రష్యన్ భాషను అతిగా లాటినీకరించే ప్రక్రియకు ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. పూర్తి పాఠం..
ఆదిమభాషలకు ఆలంబన
ప్రఖ్యాత ఆంగ్లేయ నావికుడు కెప్టెన్ కుక్ 1770లో తన విశ్వయాత్రలో భాగంగా ఆస్ట్రేలియాలో కొన్ని వారాలు గడిపాడు. స్థానికులతో మాటామంతి పెంచుకునేందుకు అక్కడి ‘గూగు- యుమిద్ధిర్’ భాషలోని వంద పదాలను, జాతీయాలను నమోదు చేసుకున్నాడు. పూర్తి పాఠం..
సినిమా సత్తా!
బాహుబలి సినిమాతో తెలుగు అనే భాష ఒకటి ఉందనే విషయం ప్రపంచం మొత్తానికీ తెలిసింది. తెలుగువాడి సత్తాను లోకం తెలుసుకుంది. 21వ శతాబ్దంలో సినిమాకి ఉన్న శక్తి అలాంటిది మరి! అత్యంత ప్రభావవంతమైన ఈ మాధ్యమం ద్వారా ఒక ప్రాంతంవారి ప్రతిభ మాత్రమే కాదు, వారు మాట్లాడుకునే భాషను కూడా పరిచయం చేయవచ్చని నిరూపిస్తున్నారు. పూర్తి పాఠం..
బుడతకీచులూ... బాగుబాగు!
బుడతకీచులు... తెలుగుగడ్డ మీద అడుగుపెట్టిన పోర్చుగీస్ వారికి మనం పెట్టిన పేరు. 1505లో గోవాలో అధికారాన్ని చెలాయించడం మొదలుపెట్టిన వీళ్లు దేశంలో చాలాచోట్లే విస్తరించారు. బ్రిటిష్ వారితో గొడవలు పడుతూ, సర్దుకుపోతూ... ఏదో ఒక మూలన అధికారాన్ని చలాయిస్తూనే వచ్చారు. పూర్తి పాఠం..
మేము ముల్తానీలం!
ఎక్కడో పాకిస్థాన్‌లోని చీనాబ్ నదీతీర వాసులు.. మన గోదావరి చెంతకు వచ్చారు. ఇక్కడే స్థిరపడ్డారు. దశాబ్దాల నుంచి కష్టాన్నే నమ్ముకుని బతుకుతున్నారు. అయితే.. వాళ్లు తమ భాషను మర్చిపోలేదు. సంస్కృతీ సంప్రదాయాలను విడిచిపెట్టలేదు. పూర్తి పాఠం..
మా పలుకే ‘పలవా కని’!
ఆస్ట్రేలియా అంటే ఆంగ్లమే గుర్తుకువస్తుంది. పాశ్చాత్యులని పోలిన వేషభాషలే స్ఫురిస్తాయి. పూర్తి పాఠం..
అక్షింతల పురుగులూ...అమ్మభాష!
వైకోకోమా... కెనడాలో ఓ చిన్న పల్లె. సంద్రం పక్కన అందమైన ప్రాకృతిక సౌందర్యంతో అలరారే ఊరు. అలగ్జాండర్ గ్రాహంబెల్ అంతటివాడు అక్కడి వాతావరణానికి ముగ్ధుడైపోయాడని చెబుతారు. వైకోకోమాలో ఆదివాసీలు ఎక్కువ. పూర్తి పాఠం..
మా భాషే మా శ్వాస!
అమ్మభాషను ఆర్థిక కోణంలో చూస్తూ, దాన్ని నేర్చుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అని ప్రశ్నించే స్థితికి వచ్చేసింది తెలుగుజాతి! లాభనష్టాల చిట్టాపద్దుల ఆధారంగా ఓ భాష. పూర్తి పాఠం..
వంద భాషల్లో ఘనాపాఠీ
తెలుగును మర్చిపోతే తప్ప పిల్లలకు ఆంగ్లం రాదు... తెలుగునాట ప్రబలిపోయిన ఓ దురభిప్రాయమిది. పూర్తి పాఠం..