చందమామ రావే
వి.రాధ
కలం చెప్పని కవిత్వం
బేట్రాయి సామి దేవుడా!
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
సరదా సరదా దసరా పాటలు
చింతలపల్లి హర్షవర్ధన్
‘ముగ్గు’లొలికే సంస్కృతి
కొమ్మే జీవిత చుక్కాని
చిలుకూరి శ్రీనివాసరావు
ఓ రేలా రేరేలా రేలా
ఆదివాసీలు ఈ దేశ మూలవాసులు. సమష్టి జీవనానికి, స్వచ్ఛతకు, స్వేచ్చకు నిలువెత్తు ప్రతిరూపాలు. కోయల జీవన విధానంలో ఎంత వైవిధ్యముంటుందో అంతకుమించిన వైదుష్యం వీరి కళా సృజనలో కనిపిస్తుంది. ప్రపంచీకరణ పెనుపోకడల ధాటిలో మరుగున పడిపోతున్న వీరి పటం, పగిడె కథల పరిచయమిది.. పూర్తి పాఠం..
సుయోధనుడితో పాచికలాటనా..!
జానపదుల ఆలోచనల్లోంచి వచ్చిన గీతమైనా, వచనమైనా; వాళ్లు వర్ణించే వస్తువు ఆధ్యాత్మికం, సాంఘికం, చారిత్రకం ఏదైనా వాళ్ల కల్పనా చాతుర్యాన్ని విశదం చేస్తుంది. నడుస్తున్న కాలంలో భాషా వినిమయంతో, చారిత్రకాంశాలకు సంఘనియతిని జోడించి, సంస్కృతీ సమ్మేళనంగా మౌఖిక సాహిత్యాన్ని ఆవిష్కరిస్తుంది జానపదం. పూర్తి పాఠం..
తల్లిపాల తెలుగు
నవమాసాలూ మోసిన తల్లి తన పాపాయికి వేసే జోలల ముత్యాలూ, లాలల వరహాలూ తెలుగు ముంగిళ్లలో తేనెలూరుతూనే ఉన్నాయి. ముద్దు ముచ్చట్లు పాటల పందిళ్లలో పాపాయి బుగ్గల్లో మెరుపుల పూలు పూయిస్తూనే ఉన్నాయి. తరతరాల నుంచీ తన మాటలు/ పాటలు ‘అమ్మపదాలు’గా తెలుగువారి గుండెల్లో ఊయలలూగుతూనే ఉన్నాయి. పూర్తి పాఠం..
పల్లె సంక్రాంతి
బంతిపూల వరసలు, గొబ్బిపాటలు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు... సంక్రాంతి వేళ తెలుగునాట నెలకొనే సందడి అంతా ఇంతా కాదు. ఆ కోలాహలాన్ని రెట్టింపు చేస్తూ, పెద్దపండగ రోజుల్లో మన రెండు రాష్ట్రాల్లో మరికొన్ని వేడుకలూ జరుగుతాయి. పూర్తి పాఠం..
పందెం కోడి
పచ్చటి తోట... గుండ్రటి బరి... కాళ్లకు కత్తులు కట్టుకున్న పుంజులు.. ఆజన్మ శత్రుత్వం ఏదో ఉన్నట్టు అవి ఎగిరెగిరి తన్నుకుంటుంటే ఈలలేసి గోలచేసే జనాలు.. చేతులు మారే కాసులు... క్షణాల్లో మారిపోయే తలరాతలు... ఆచారమో దురాచారమో, సంప్రదాయమో వ్యసనమో కానీ కోడిపందేలనూ పెద్దపండగనూ వీడదీసి చూడలేరు! పూర్తి పాఠం..
పాటల పండగ
భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ... అన్నీ కలిస్తేనే పెద్దపండగ! కానీ, దాని గురించి ఎవరేం మాట్లాడుకున్నా భోగి, సంక్రాంతిలతో ఆగిపోతారు. అయితేగియితే ‘పశువుల పండగ’ అని మాత్రమే కనుమను వర్ణిస్తారు. ముక్కనుమ రోజు ‘ముక్కలు’ తినాలని ఒక్కముక్క చెప్పేసి ఊరుకుంటారు. పూర్తి పాఠం..
కుదుళ్ల తులసికి గోవిందరామ...
తులసిని పవిత్రంగా భావించి పూజిస్తారు మనదేశంలో. ఆ మొక్కకున్న ఔషధ గుణాలవల్ల దానికి పవిత్రత ఆపాదించి ఉంటారు. ప్రతీ సంవత్సరం కార్తీక శుద్ధ Äఏకాదశి నుంచి పౌర్ణమి వరకు తులసి పూజ చేస్తారు. జానపదులు వివిధ సందర్భాలకు అనుగుణంగా పాటలు కట్టుకొని పాడుకున్నట్లే తులసమ్మపై కూడా పాటలు కట్టుకొని పాడుకొన్నారు. పూర్తి పాఠం..
గుడు గుడు గుంచం... గుండే రాగం!
అమ్మలందరూ అష్టాచెమ్మా... అమ్మాయిలేమో తొక్కుడుబిళ్ల... ఇక అబ్బాయిలు కోతికొమ్మచ్చి... ఎవరికిష్టమైన ఆట వాళ్లాడుకునేవాళ్లు. ఆడుతూ పాడేవాళ్లు. పాడుతూ ఆడేవాళ్లు. కలుపుగోలుతనాన్ని పెంచే ఆ అచ్చతెలుగు ఆటలిప్పుడు అదృశ్యమవుతున్నాయి. వాటితో పాటే మనదైన సాంస్కృతిక సంపదా మాయమవుతోంది. పూర్తి పాఠం..
చెమటానా నీ బొట్టు వెండల్లే మెరిసేను!
నిండైన తెలుగుదనానికి మెండైన ఉదాహరణలు మన పల్లెలు. అక్కడి ఆప్యాయతానురాగాలు సుమగంధాలను అద్దుకుని సురగంగా ప్రవాహంలా సాగిపోయే పదాల అల్లికలు మన జానపదాలు. కాలం గడిచేకొద్దీ మనుషుల మధ్య ఆపేక్షలతో పాటు మనవైన భాషాసంస్కృతుల మీదా చీకట్లు కమ్ముకున్నాయి. పూర్తి పాఠం..