కాలానికి ముందుమాట గురజాడ బాట
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
అమ్మ పలుకు చల్లన
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మన తెలంగాణ కోటి పద్యాల వీణ
కోవెల శ్రీలత
చేతులారంగ శివపూజ చేయవలయు
డా।। ముదిగొండ ఉమాదేవి
అక్షరమూర్తులు... చైతన్యదీప్తులు
కాత్యాయనీ విద్మహే
కవీ..రవీ...
గణేశ్ బెహరా
మీసా...రోషాలు!
మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె! వెనకటికెవరో వెక్కిరించారు. అంబలి తాగేవారికి మీసాలు ఎగబట్టేవారు కొందరా! అని ఇంకెవరో దెప్పిపొడిచారు. మీసమంటే అంత అలుసా! రోషానికైనా, పౌరుషానికైనా అదే గుర్తు కదా. పూర్తి పాఠం..
మరుగున పడుతున్న మాణిక్యాలు
‘ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?’’ అంటాడు చిన్నమయ్యతో ఘటోత్కచుడు మాయాబజార్ సినిమాలో. దీన్ని కొంచెం మార్చి ‘ఎవరూ పట్టించుకోకపోతే ప్రసిద్ధ రచయితలు వాడిన మాటలు ఏమైపోతాయి?’ అని చెప్పుకోవచ్చునేమో! పూర్తి పాఠం..
టెలుగు మమ్మీకి జాస్మిన్ దండ!
రాజు గారి టేబుల్ మీద మూడు రకాల ట్రేలు ఉన్నాయి. ఎడమ చేతివైపు ట్రే మీద ‘అత్యవసర సమస్యలు’ అని లేబుల్ ఉంది. మధ్య దాని మీద ‘అవసర సమస్యలు’, కుడి చేతి వైపున్న దానిమీద ‘సమస్య కాని సమస్యలు’ అని ఉంది. పూర్తి పాఠం..
తల్లీ నిన్ను దలంచి!
అమ్మే సత్యం. అమ్మప్రేమే స్వచ్ఛం. ఇందులో మరో మాటకు తావు లేదు. బంధాలెన్ని ఉన్నా బిడ్డకు అమ్మతోనే అనుబంధం. నా బిడ్డ బంగారమనే తల్లులు, మా అమ్మ దేవత అని చెప్పే పిల్లలు... పేగుబంధం కదా అనంత ప్రేమకది ఆధారం. అందుకే మన కావ్యకర్తలు, కథకులు... అందరూ అమ్మకు అక్షరపూజ చేశారు. అమ్మప్రేమను అజరామర భావనలతో అక్షరీకరిం పూర్తి పాఠం..
అందులోనే భారతం... అందులోనే రామాయణం
రాతిని నాతిగా చేసిన రామయ్య గరిమ... హిడింబిని ఏలుకున్న భీమయ్య పెరిమ... కాళీయుని కోరలూడబెరికిన కన్నయ్య కొలవి... ఒకే పద్యంలో దర్శనమిస్తే, ఆ కవన ప్రతిభకు పాదాభిషేకం చేయాలనిపించదూ! పూర్తి పాఠం..
తెలుగు తిరకాసులు
తెలుగదేలయన్న అందులో ఎన్నో తిరకాసులు. ఎన్నో ఊసులు.. ఒత్తులూ.. ఒత్తిళ్లు.. తెలుగుతల్లి లక్ష ‘ఒత్తుల’ నోము సలక్షణంగా నోచుకుంది. అయితేనేం ఆయమ్మకున్న కోట్లమంది ముద్దుబిడ్డల్లో కొంతమంది దానిని లెక్కచేయడం లేదు. ఉన్నచోట్ల కొన్ని ఒత్తుల్ని తీసేస్తున్నారు. ఇందుకు ఓ ఉదాహరణ: ‘బగవంతుడికి బక్తుడికి బేదమేముంది’ అ పూర్తి పాఠం..
సవ్యసాచి సత్యభామ
మనషిలోని అజ్ఞానమే రాక్షసత్వం, దానిని మథించి జ్ఞానవృద్ధిని పొందటమే వెలుగు. దీని సారాంశమే దివ్య దీపావళి. అందుకే ‘తమసోమా జ్యోతిర్గమయ’ అన్నది రుషి వాక్యం. సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికత, శాస్త్రీయత, చైతన్యం, ఆనందం కలబోతే ఈ పర్వదినం. పూర్తి పాఠం..
నాటకానికి అడుగుజాడ కందుకూరి
చిటికెడు అపార్థం... పిడికెడు అభిమానం... చారెడు విషాదం... దోసెడు ఆనందం... వీటన్నింటి కలబోతే జీవితం. ఆ జీవిత రంగంపై చీకటి వెలుగుల తారంగం; వెలుగు నీడల సయ్యాట నాటకం. అనేక రుచులున్న జనానికి వండి ఒకే పళ్లెంలో వడ్డించేది నాటకం. అది కన్నీళ్లను చిందిస్తుంది. నవ్వుల పువ్వులను పూయిస్తుంది. పూర్తి పాఠం..
పద్మవ్యూహంలో కదం తొక్కిన తిక్కన!
‘ప్రపంచమొక పద్మవ్యూహం’ అన్నాడు శ్రీశ్రీ. తెలుగు సాహితీ ప్రపంచానికి పద్మవ్యూహాన్ని పరిచయం చేసిన కవి తిక్కన సోమయాజి (క్రీ.శ. 1205- 1288). వ్యాసుని సంస్కృత భారతం ఆధారంగా ఆయన రచించిన ‘శ్రీ మదాంధ్ర మహాభారతము’లోని ద్రోణపర్వం ఈ వ్యూహ విశిష్టతను అద్భుతంగా వివరిస్తుంది! పూర్తి పాఠం..