రాయలసీమ కథారత్నాలు
డా।। అప్పిరెడ్డి హరినాథరెడ్డి
భాషకు భూషణం రాజ పోషణం
మావుడూరు సూర్యనారాయణమూర్తి
సింహపురి కళల కోవెల
ఎ.బాలభాస్కర్
శ్రీశైలం... ఘన చరితకు ఆలవాలం
డా।। దువ్వూరి భాస్కరరావు
కవిలెకట్టల చరిత్ర
డా.పి.ఎస్. ప్రకాశరావు
రావిరేకలతో మొదలు బొబ్బిలికాయలతో ఆఖరు
నన్నయ, తిక్కన, పోతన... ఇలా ఏ ప్రాచీన తెలుగు కవిని తీసుకున్నా, ఒక చేతిలో తాళపత్రాలు, మరో చేతిలో ఘంటాన్ని పట్టుకున్న చిత్రాలు, విగ్రహాలే కనిపిస్తాయి. వాటిని చూస్తే శ్రద్ధగా రాయడం అంటే ఇలాగేనేమో అనిపిస్తుంది. పూర్తి పాఠం..
పట్టుచీరలో మెరిసిపోయే ఇల్లాలి ముక్కుకు ముక్కెర... మెడలో పచ్చలపేరు... చేతులకు పసిడి గాజులు... ఓహ్! లంగావోణీ కట్టుకుని... అరవంకీలు పెట్టుకుని... వడ్డాణం చుట్టుకుని... కాలి అందియలు ఘల్లుఘల్లుమన నడిచివచ్చే అమ్మాయి అయితే సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మే! సరే కానీ, మనకు ఉన్నవి ఈ కొద్దిపాటి ఆభరణాలేనా? పూర్తి పాఠం..
పుష్కరానికి ఎంత ‘కథో’!
శర్మ కృష్ణవేణి నర్మద గౌతమి/ గంగ పెన్న యలక తుంగభద్ర/ సహ్యతనయ యమున సప్తగోదావరీ/ తీరముల మునింగితిని వెలంది!... అంటూ రాసుకొచ్చాడు ‘సత్యభామాపరిణయము’ కృతికర్త. ఆయనొక్కడనేముంది కానీ, తెలుగువాళ్లందరూ తరతరాలుగా నదీస్నానం ఆచరిస్తున్న వాళ్లే. పుణ్యం కోసమని కొందరు... పూర్తి పాఠం..
మన ప్రాభవగీతి అమరావతి
అమరావతికి ఇప్పుడు మూడోసారి రాజధాని గౌరవం దక్కుతోంది. ‘ధాన్యకటకం’ పేరుతో శాతవాహనుల కాలంలో మొదటిసారి కీర్తి పీఠం ఎక్కింది. రాజావాసిరెడ్డి వేంకటాద్రి నాయుడి జమీందారీ రాజధానిగా రెండోసారి వాసికెక్కింది. నవ్యాంధ్ర రాజధానిగా ఇప్పుడు మూడోసారి శాశ్వతంగా స్థిరపడింది. పూర్తి పాఠం..
శ్రీ రమ్యంబుగా శ్రీ గిరియాత్రకు/ కూరిమి సతితో కూడి నడచితిని... పల్లెలు పురములు పట్టణంబులు/ పేటలు దాటితి అడవులు కొండలు అన్నీ దాటితి.... చూచితి నెవ్వరు చూడని లింగం/ చూచితి కేవల సుందర లింగం... అంటూ తెలుగువాళ్లు ఎక్కడికి సకుటుంబంగా తరలివెళ్లి ఏ పురాణ లింగాన్ని చూసి తరించిపోతారో అదే శ్రీశైల మల్లికార్జున పూర్తి పాఠం..
ఫణిగిరి నుంచి న్యూయార్క్‌కు
‘‘పూర్వోక్త కారణములవల్ల భారతీయ దేవమందిర నిర్మాణ కళకు మనకు తెలిసిన ప్రథమోదాహరణము లన్నియు బౌద్ధమునకు సంబంధించినవే. బౌద్ధకళకు బుద్ధుని జీవితమిచ్చిన ప్రోత్సాహమనల్పమైనది. బుద్ధుని జీవితము ఒక్క బౌద్ధమతావలంబులనే కాక శిల్పులను సమానముగ నుత్తేజపరిచిన దివ్యచరితము, ఒక యద్భుతకథ’’ అన్నారు మల్లంపల్లి సోమశేఖరశర్మ. పూర్తి పాఠం..
కన్నడసీమలో తెలుగు ‘శాసనం’
‘‘ప్రాచీన శాసనాలను లోతుగా అధ్యయనం చేసినకొద్దీ కొత్త కోణాలు బయటపడతాయి. భాషా సంస్కృతులకు సంబంధించిన నూతన కోణాలు వెలికివస్తుంటాయి’’ అంటారు ప్రఖ్యాత శాసన పరిశోధకులు పి.వి.పరబ్రహ్మశాస్త్రి. ఇటీవల వెలుగులోకి వచ్చిన కన్నడ నేల మీది తెలుగు శాసనాలు ఈ విషయాన్ని నిర్ధరిస్తున్నాయి. పూర్తి పాఠం..
మన కళాఖండం...అఖండం
అమరావతీ నగర అపురూప శిల్పాల గురించి ప్రపంచమంతటికీ తెలుసు. లండన్ మ్యూజియంలోనే అవి కొలువుదీరాయి. ఓరుగల్లు, లేపాక్షి శిల్పాల ఘనతా జగద్విదితమే. తెలుగువారి శిల్పకళ గురించి చెప్పుకునేటప్పుడు ఎక్కువశాతం చర్చలు వీటి మీదే నడుస్తాయి. కానీ, తెలుగునాట ఇంకెంతో శిల్పసంపద ఉంది. పూర్తి పాఠం..
మన మాటకు మూలాలెక్కడ?
తెలుగు భాష ఏనాటిది? అన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు. కానీ తెలుగు మూడువేల ఏళ్లకు పూర్వమే ఉండి ఉంటుందని భాషా చరిత్రకారుల అంచనా. తెలుగుకు మూలభాషేమిటి? తెలుగువారెవరు? అన్న ప్రశ్నలెన్నో పరిశోధకుల ముందున్నాయి. ఇవి తేల్చలేనివి కావు. కానీ, ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇంకొన్నేళ్లు పట్టవచ్చు. పూర్తి పాఠం..