ముఖపురాణం
టి.చంద్రశేఖరరెడ్డి
అమ్మభాషకు వరం అనంతపురం
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
పశ్చిమగోదావరి పలుకే బంగారం
ఎస్.ఆర్.భల్లం
మెతుకుసీమ మాట మధురం
డా।। గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
కడప గడపకు తెలుగు తోరణం
సి.శివారెడ్డి
పసిపాపగా అమ్మ
విజయబక్ష్
పదాల పరమార్థాలు పెరుమాళ్లకెరుక
‘‘మీ అక్షరాలు ముత్యాలు మాస్టారూ’’ అన్నాడో శిష్యుడు గురువుగారిని కాకాపట్టడానికి. ‘‘నా నీళ్లు ముత్యాలా? ఇదెక్కడి దిక్కుమాలిన పోలికరా శుంఠ...!’’ అంటూ వెంటనే వాతపెట్టారు ఆ మాస్టారు. చేతిరాత గురించి చెబుతుంటే గురువుగారు నీళ్లంటున్నారేంటని కుర్రాడు తెల్లముఖమేశాడు. పూర్తి పాఠం..
ఒక్కో అక్షరం ఒక్కో అర్థం
ఎవరైనా చెప్పిన మాటే పదేపదే చెపితే ‘చెప్పిందే ఎన్ని సార్లు చెబుతారూ’ అని అంటాం. మాట గురించే అలా అనుకుంటే మరి శాశ్వతంగా ఉండే సాహిత్యం కోసం ఏమనుకోవాలి! అదీ కవిసార్వభౌముడు శ్రీనాథుడి పద్యమైతే!!!... అవును నిజంగా ఆయన చెప్పిందే. పూర్తి పాఠం..
వరంగల్లు తెలుగు... వీనులవిందు
తెలుగునేలను ఏకం చేసి వైభవంగా పరిపాలించిన కాకతీయ సామ్రాజ్యానికి కేంద్ర బిందువు... తిక్కన, పాల్కురికి సోమన, శివదేవయ్య, పోతన లాంటి కవి పండితులు నడిచిన నేల... ఓరుగల్లు. కుతుబ్షాహీలు, నిజాంల పాలనలో మహమ్మదీయ ప్రాబల్యానికీ లోనైన ప్రాంతమిది. అలాంటి వరంగల్లు తెలుగు వైభవం కాకతీయుల తోరణమంత! పూర్తి పాఠం..
చిలుక పలుకుల మధ్య కాకిగోల
మానవుడు జంతువునుంచి పుట్టాడంటారు. అది నిజమో కాదో అలా ఉంచితే - మనిషికి జంతువులకీ అవినాభావ సంబంధం ఉంది. జంతువుల నుంచి మనిషిని వేరుచేసేది భాష మాత్రమే. పూర్తి పాఠం..
పసిడి చీర వాడికి పాలకూడు
కవిత్వానికి మాట్లాడే భాష నిషిద్ధం కాదు. భాషలో దొరికే అన్ని వనరులనూ కవిత్వ భాష వాడుకుంటుంది... ఇది చేరా మాట. శతాబ్దాల కిందటే అన్నమయ్య దీన్ని ఆచరించాడు. పూర్తి పాఠం..
ఆయన వీరకాడు ఈయన జగిలోడు
భాష సజీవ వ్యవస్థకు చెందింది. నిత్యం పరిణామం చెందుతూనే ఉంటుంది. ఈ మార్పు కావ్యభాషలో చాలా ఆలస్యంగానూ, వ్యవహార భాషలో చాలా తొందరగానూ వస్తుంది. ప్రాంతీయ, సామాజిక, చారిత్రక, వృత్తికాల భేదాల్ని బట్టి ఒకే భాష విభిన్న రకాలుగా వ్యవహారంలో ఉంటే, ఆ భాషలో మాండలికాలు ఏర్పడతాయి. పూర్తి పాఠం..
కలమళ్లలో శిలాక్షరమైన ప్రాచీన తెలుగు... తాళ్లపాకలో జ్ఞానపథమైన జానపద తెలుగు... అంతా ఆ వసుధ వెలుగే! పెద్దన జిగిబిగి అల్లికలు... వేమన ఉపమానాలు... అన్నీ ఆ మట్టి మెరుపులే! ఒంటిమిట్ట కోదండరాముడు... నందలూరు బుద్ధుడు... దానవులపాడు తీర్థంకరుడు... అందరూ ఆ నేల వేల్పులే! పూర్తి పాఠం..
‘లాలపోసుకుంటావా బుజ్జికన్నా’... అని అమ్మ పిలవగానే బోసినవ్వుతో పరిగెత్తుకొచ్చేస్తాడు బంగారు తండ్రి! కాసేపు నీళ్లతో పండుగ చేసుకుంటాడు. తర్వాత ‘ఆం తిందామా నాన్నా’ అనగానే... పెట్టమంటూ నోరు తెరిచేస్తాడు. ఇలా పసివాళ్లతో మాట్లాడుతూ... మాట్లాడిస్తూ... తెగ సంబరపడిపోయే తల్లులు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తారు. పూర్తి పాఠం..
కొమరు పలుకుల కర్నూలు
కేతవరం కొండరాళ్లపై ఆదిమానవులు చేసిన ‘చిత్ర’ సంతకాల వయసు ఎనిమిది వేల సంవత్సరాలు... చరిత్ర చిన్నది కాదు! శ్రీశైల మల్లన్న... యాగంటి బసవన్న... అహోబిల నారసింహ... మంత్రాలయ రాఘవేంద్ర... కొలువుదీరిన కోవెలమూర్తులకు కొదువలేదు! పూర్తి పాఠం..