అర్థాలే వేరులే!
డా।। ద్వా.నా.శాస్త్రి
సిక్కోలు యాస సితక్కొట్టదేటి!
డా।। ఎం.సి.దాస్
తలంటి...!
అక్షరాలతో ఆడుకుందామా?
విజయబక్ష్
ముఖపురాణం
టి.చంద్రశేఖరరెడ్డి
అమ్మభాషకు వరం అనంతపురం
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
గుంటూరు తెలుగు తేనెలూరు
కారంపూడిలో కలియదిరిగిన పాతరాతి యుగపు మానవుడు... భట్టిప్రోలులో రాజ్య పతాకాన్ని ఎగరేసిన యశోధరుడు... చరిత్ర గుర్తులెన్నో! పౌరుషానికి ప్రాణం పెట్టే పల్నాడు... కళల కాణాచి తెనాలి... విస్మరించలేని ఊళ్లెన్నో! సిరుల వరాలనిచ్చే వరి... ఘాటెక్కించే మిరప... దుగ్గిరాల పసుపు... పలకరించే పైరులెన్నో! పూర్తి పాఠం..
మాండలికంపై మనసు పారేసుకుని...
‘ఎంకివంటి పిల్ల లేదోయి లేదోయి...’ అంటూ ఎదను గిల్లే ఎంకి పాటలను విన్నాం. చదివాం. బంగారిమామ, కిన్నెరసాని, కూనలమ్మ... మొదలైనవీ మనకు తెలుసు! వీటిలో గణాలు, యతులు లాంటి ఛందస్సు ఛాయలు లేవు. అయితే ఇవి పాటలు. పూర్తి పాఠం..
వెటకారాల దారిలో గోదారి
‘‘గోదారి జిల్లా వోళ్లు సామాన్యులు కారొరోయ్! ఆళ్ల మాటల్లో మమకారం, చమత్కారం, ఎటకారమే కాదు, ఆ మాటకొస్తే కాసింత సూరేకారం కూడా కలగలిసుంటాదని అందరనుకుంటారహే’’ అని గోదారోళ్లే అనేసుకోడం కూడా కద్దు. ఆ ఊసులెలాఉన్నా గోదారి జిల్లావోళ్లు పరమ లౌక్యులన్న అభిప్రాయం లోకంలో ఎందుకో మరి స్థిరపడిపోయింది. పూర్తి పాఠం..
‘ఉప’యను రెండక్షరాలు
ఉపకారం, ఉపవాసం, ఉపాఖ్యానం, ఉపాయం, ఉపధ, ఉపమానం, ఉపాధ్యాయుడు, ఉపదేశం, ఉపరాష్ట్రపతి ఇలా ఎన్నో పదాల్లో ముందు వరుసలో కూర్చుంటుంది. వ్యాకరణ, సాహిత్య, ఆధ్యాత్మిక, రాజకీయాలు... ఇలా ఏ రంగమైనా సరే ‘ఉప’అనే రెండక్షరాలు దర్శనమిస్తూనే ఉంటాయి. పూర్తి పాఠం..
పదాల పరమార్థాలు పెరుమాళ్లకెరుక
‘‘మీ అక్షరాలు ముత్యాలు మాస్టారూ’’ అన్నాడో శిష్యుడు గురువుగారిని కాకాపట్టడానికి. ‘‘నా నీళ్లు ముత్యాలా? ఇదెక్కడి దిక్కుమాలిన పోలికరా శుంఠ...!’’ అంటూ వెంటనే వాతపెట్టారు ఆ మాస్టారు. చేతిరాత గురించి చెబుతుంటే గురువుగారు నీళ్లంటున్నారేంటని కుర్రాడు తెల్లముఖమేశాడు. పూర్తి పాఠం..
ఒక్కో అక్షరం ఒక్కో అర్థం
ఎవరైనా చెప్పిన మాటే పదేపదే చెపితే ‘చెప్పిందే ఎన్ని సార్లు చెబుతారూ’ అని అంటాం. మాట గురించే అలా అనుకుంటే మరి శాశ్వతంగా ఉండే సాహిత్యం కోసం ఏమనుకోవాలి! అదీ కవిసార్వభౌముడు శ్రీనాథుడి పద్యమైతే!!!... అవును నిజంగా ఆయన చెప్పిందే. పూర్తి పాఠం..
వరంగల్లు తెలుగు... వీనులవిందు
తెలుగునేలను ఏకం చేసి వైభవంగా పరిపాలించిన కాకతీయ సామ్రాజ్యానికి కేంద్ర బిందువు... తిక్కన, పాల్కురికి సోమన, శివదేవయ్య, పోతన లాంటి కవి పండితులు నడిచిన నేల... ఓరుగల్లు. కుతుబ్షాహీలు, నిజాంల పాలనలో మహమ్మదీయ ప్రాబల్యానికీ లోనైన ప్రాంతమిది. అలాంటి వరంగల్లు తెలుగు వైభవం కాకతీయుల తోరణమంత! పూర్తి పాఠం..
చిలుక పలుకుల మధ్య కాకిగోల
మానవుడు జంతువునుంచి పుట్టాడంటారు. అది నిజమో కాదో అలా ఉంచితే - మనిషికి జంతువులకీ అవినాభావ సంబంధం ఉంది. జంతువుల నుంచి మనిషిని వేరుచేసేది భాష మాత్రమే. పూర్తి పాఠం..
పసిడి చీర వాడికి పాలకూడు
కవిత్వానికి మాట్లాడే భాష నిషిద్ధం కాదు. భాషలో దొరికే అన్ని వనరులనూ కవిత్వ భాష వాడుకుంటుంది... ఇది చేరా మాట. శతాబ్దాల కిందటే అన్నమయ్య దీన్ని ఆచరించాడు. పూర్తి పాఠం..