ఇప్పటికైనా మారుస్తారా?
తెలుగు వెలుగు బృందం
అచ్చమైన తెలుగు బ్లాగు
అభిమానమంటే ఇదీ...!
పిట్ట కథలు బుర్ర కథలు
సమగ్ర సాహిత్య సమాహారం
భలే బ్లాగు
ఆమె తెలుగు పాఠాలు చదువుకోలేదు. బడికెళ్లి నేర్చుకున్నదంతా ఆంగ్లంలోనే. చేసేదేమో సమాచార సాంకేతిక రంగ వ్యాపారం! కానీ అమ్మ నేర్పిన తెలుగు అక్షరాలను మాత్రం మర్చిపోలేదు. సరికదా! కథలు రాసే స్థాయిలో అమ్మభాషపై పట్టుపెంచుకున్నారు. పూర్తి పాఠం..
తెలుగు సాహిత్యాభిమానులందరికీ శుభవార్త...! సినారె సాహిత్యప్రస్థాన సమస్త సమాచారమంతా ఒకేచోట కొలువుదీరింది. కొలబద్దల్లో ఇమడ్చలేని ఆ కవి మానసపుత్రికల వివరాలన్నీ ‘మౌస్ క్లిక్కు’ దూరంలోకి వచ్చేశాయి. పైన చెప్పుకున్న వెబ్సైట్ను తెరిస్తే... సినారె సాహితీ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లే! పూర్తి పాఠం..
తెలుగు సాహిత్యానికి నేటి తరంలో మేటి ప్రదర్శనా సామర్థ్యం ఉన్న సాధనాలుగా వెబ్సైట్లు, బ్లాగులూ పరిచయమయ్యాయి. అవి సాహితీ ప్రక్రియల్లో ఏదో ఒకే అంశానికి పరిమితమై ఉండటం కద్దు. పూర్తి పాఠం..
నలుగురు కుర్రాళ్లు కలిస్తే పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటారనుకుంటాం. కానీ ఆ కబుర్లనుంచే ఓ మంచి ఆలోచన స్ఫురించి... సమాజానికి ఉపయోగపడే కార్యంగా మారితే నిజంగా అబ్బురమే! మన అమ్మభాషకు సాంకేతిక తళుకులు అద్దుతున్న ‘తెలుగు టెకి’ బ్లాగు ఇలా పురుడుపోసుకున్నదే. పూర్తి పాఠం..
కంప్యూటర్ పనిచేయాలంటే, అదీ అన్ని సదుపాయాలతో కావాలంటే బోలెడన్ని సాఫ్ట్వేర్లు కావాలి. అలాగనీ వేలకు వేలు పోసి సాఫ్ట్వేర్లన్నీ కొనలేం. ఒకవేళ కొన్నా అవి ఎలా పనిచేస్తాయో తెలియదు. పోనీ ఉచిత (ఓపెన్సోర్సు) సాఫ్ట్వేర్లను వాడదామని వాటి గురించి అంతర్జాలంలో వెతికితే సమాచారమంతా ఆంగ్లంలోనే ఉంటుంది. పూర్తి పాఠం..
ఉచిత పుస్తకాలు
ఒక్క క్లిక్ దూరంలో ఉండే గ్రంథాలయమది! అంతర్జాలమే వేదికగా 4 వేలకు పైగా పుస్తకాలతో కొలువుదీరిన పొత్తాలగుడి ఇది. ప్రబంధాల నుంచి కథాసంపుటాల వరకూ మన సాహిత్యం లోని మేలిమి గ్రంథాలను పాఠకులకు అందుబాటులో ఉంచిన ఆ వెబ్సైట్... https://www.freegurukul.org. పూర్తి పాఠం..
భాషకు పొదరిల్లు ... భావాల హరివిల్లు
మనిషంటేనే ఎన్నెన్నో భావాల వాహిక. బోలెడన్ని అనుభూతుల జమిలిక. వాటికి అక్షర రూపమివ్వాలని, నలుగురితో పంచుకోవాలనే ఆరాటపడేవారెందరో! అలాంటి వాళ్లకి వేదికగా నిలుస్తోంది ‘భావుక’ ఫేస్బుక్ సమూహం. పూర్తి పాఠం..
ఎందరో కవయిత్రులు
స్త్రీలు చదువుకోవడానికి కూడా నోచుకోని కాలం అది. అప్పుడే మగవాళ్లతో సమానంగా చదువుకుని గొప్ప సాహిత్యాన్ని సృష్టించారు మన కవయిత్రులు. అలాంటి వాళ్ల గురించి చరిత్రలో ఎక్కువగా నమోదు కాలేదు. ఆ లోటును తీరుస్తూ తొలితెలుగు కవయిత్రి నుంచి ఈతరం కవయిత్రుల వరకూ అందరి వివరాలనూ అందిస్తోందో వెబ్సైట్. పూర్తి పాఠం..
వరెవ్వా.. వాట్సప్!
సామాజిక మాధ్యమాలంటే కేవలం వెబ్సైట్లు కాదు. అవి అనుభూతిమయ సమాంతర ప్రపంచాలు! తను ఏ ‘సమూహం’లో భాగస్వామిని కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వ్యక్తికి భౌతిక ప్రపంచంలో ఉండదు. పూర్తి పాఠం..