పీడను వదిలించుకుందాం
పరవస్తు నాగసాయిసూరి
జీవితమే ఒక దీపావళి
డి.కస్తూరి రంగనాథ్
భాషలేనిది... బంధమున్నది
ఓలేటి శ్రీనివాసభాను
అడ్డాల నాడేనా బిడ్డలు?
సమాజమే ఇతివృత్తం
డా।। పరుచూరి గోపాలకృష్ణ, డా।। సింగుపురం నారాయణరావు
లఘుచిత్ర లహరి
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు...
కిక్కిరిసిపోయిన రైలు బోగీ లాంటిది మనసు. అడుగడుగునా ఏవో అభిప్రాయాలు, ఆలోచనలు, ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు...! బతుకు మజిలీల లోతుల్లో కొన్ని ఇంకిపోతుంటాయి. ఆ ఖాళీలను నింపడానికా అన్నట్లు ఎక్కడెక్కడి నుంచో కొత్తవి కొట్టుకొస్తాయి. పూర్తి పాఠం..
జామురాతిరీ జాబిలమ్మా..!
నింగిలోని చందమామను చూసినప్పుడు ఆనందంతో పులకరించిపోతాం. ఏ పగడపు దీవుల్లోకో పోయి విహరించినట్టు, వెన్నెల మైదానాల్లో జాజిపూల అత్తరు దీపాల చెంత సేదతీరినట్టు భావిస్తాం. అయితే, ఆ నీలాల చంద్రుడు వెండితెర మీద వెన్నెల కురిపిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందీ! పూర్తి పాఠం..
కులం కూడు పెట్టదు. మతం మంచినీళ్లు పోయదు. మానవత్వమే మనిషికి బలం. సామరస్య సహజీవనమే సంఘానికి శ్రేయస్కరం! మనిషితనానికి గొడ్డలిపెట్టు మూఢనమ్మకం. సమాజానికి అది ప్రమాదకరం. రాజ్యం బలవంతుడి భోజ్యమా? కష్టాలూ కన్నీళ్లే పేదలకు పంచభక్ష్యాలా? సహించేది లేదు. ఎదురుతిరగడమే మార్గం. సమసమాజమే మా జీవిత స్వప్నం! పూర్తి పాఠం..
బిడ్డ కంట నీరొస్తే అమ్మ కంట నెత్తురు కారుతుంది! అక్కర లెక్కలకు అతీతమైన ఆ అమ్మప్రేమను అర్థం చేసుకోకుండా... గోరుముద్దలు తిన్న నోటితోనే తల్లిని తూలనాడే తనయులున్నారీ లోకంలో. అలాంటి వారి చేతలు అధర్మానికి చేయూతనందిస్తాయని చెబుతుందా సినీ గీతం. పూర్తి పాఠం..
మల్లెలు పూసే... వెన్నెల కాసే...
మా సీత సొగసు మల్లెకన్నా తెల్లనంటారొకరు! మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి పెడతానంటారు మరొకరు. ‘వెన్నెలలో మల్లియలు... మల్లెలలో ఘుమ ఘుమలు... ఘుమఘుమల్లో గుసగుసలు... ఏవేవో కోరికలు ఏవేవో కోరికలు’ అంటూ మెలికలు తిరిగిపోతారు ఇంకొకరు. పూర్తి పాఠం..
పదకొండు నిమిషాల ముప్ఫై మూడు సెకన్ల ఓ లఘుచిత్రానికి యూట్యూబ్లో 4.5 లక్షల ‘హిట్లు’... పైగా ‘కామెంట్ల’ కెరటాలు ఉవ్వెత్తున ఎగిశాయి. అలా అభిప్రాయాలు పంచుకున్న వారిలో నూటికి తొంభైమంది యువతే. వాళ్లకు అంతగా నచ్చిందంటే ఆ చిత్ర కథ ఏమై ఉంటుంది? పూర్తి పాఠం..
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
పాట మనిషి మానసిక అవసరాలను తీర్చే సాధనాల్లో ఒకటి. అయితే.. అన్ని పాటలకూ ఆనందం కలిగించే గుణానికి తోడుగా ఆలోచన కలిగించే శక్తి ఉండదు. ముఖ్యంగా తెలుగు సినీ గీతాల్లో శ్రోతలకు మనోస్థైర్యాన్ని కలిగించేవి తక్కువగానే కనిపిస్తాయి. పూర్తి పాఠం..
బ్రోచేవారెవరురా, మల్లేశం, ఓ..బేబీ, దొరసాని - సమీక్షలు
కారుమబ్బులు వీడిపోతున్నాయి. చలనచిత్రాలు తిరిగి ‘తెలుగు బాట’ పడుతున్నాయి. మన పలుకుల తియ్యందనాన్ని పంచుతున్నాయి. ఇటీవల వచ్చిన చిత్రాల్లో పరచుకున్న తెలుగు వెన్నెల ఇది...! పూర్తి పాఠం..
ఒకరిది మధ్య తమిళనాడులోని కావేరి పరీవాహక ప్రాంతం.. మరొకరిది ఉత్తరాంధ్రలోని నాగావళి తీరం.. మధ్యతరగతి జీవిత నేపథ్యం ఒకరి ఇతివృత్తం.. మట్టిమనుషులు శ్వాసించే యాస మరొకరి ఆయుధం... ఆ ఇద్దరి ఏకైక సారూప్యం.. నాటకరంగం! సినిమా రంగం కలగలిపిన ఆ ప్రతిభామూర్తుల బంధానికి భాష లేదు. పూర్తి పాఠం..