అమ్మభాషకు గొడుగు గిడుగు
పి.స్నేహలతా మురళి
అందరి గొడవ కాళోజీ గొడవ!
ఎ.సుబ్రహ్మణ్యం
పలుకే పద్య మాయెరా!
మాశర్మ
తెలుగువారి ఠాగూర్ సంజీవదేవ్
వెనిగళ్ల వెంకటరత్నం
స్వరాజ్య పోరాటంలో తెలుగు వెలుగులు
ఇడమకంటి లక్ష్మీరెడ్డి
తెలుగు తల్లికి తేటగీతి
మందలపు నటరాజ్
మండిన కన్నీళ్లే ఆళ్వారు అక్షరాలు
ఆయన... నిజాం నిరంకుశత్వంపై దూసిన అక్షరాల తల్వార్. పీడనకు వ్యతిరేకంగా పైకెత్తిన ఉక్కు పిడికిలి. ఆకారం చూస్తే సౌమ్యత కనిపించినా అది నినదించే ఉద్యమస్వరం. రచయితా కార్యకర్తా ఒకే దగ్గరచేరిన మూర్తి. చిత్తశుద్ధి, నిజాయతీలకు నిలువెత్తు రూపం. ఆయనది ధర్మాగ్రహం. పూర్తి పాఠం..
జానపదాలే ప్రాణంగా...ఓ బాటసారి
కళింగాంధ్ర గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరించే ఇలాంటి వెయ్యికి పైగా పాటలు... దాదాపు అరవై జానపద కళల గురించిన సాధికారిక సమాచారంతో వచ్చిన పుస్తకాలు ‘కళింగాంధ్ర జానపద గేయాలు’, ‘కళింగాంధ్ర జానపద కళలు’. సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుంటూ పన్నెండేళ్ల పాటు పరిశ్రమించిన ఓ సాధారణ ఉపాధ్యాయుడి స్వేదబిందువులే ఈ పొత్తాలు. పూర్తి పాఠం..
మనసు భాషా నిపుణుడు
ఆయన మానసిక వైద్య నిపుణులు. ఆ శాస్త్రానికి సంబంధించి విస్తృతంగా రచనలు చేశారు. వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్య పరిరక్షణ మీద వేలాది శిక్షణా తరగతులు నిర్వహించారు. అంతేనా! నిరంతర చదువులతో 24 పట్టాలు అందుకున్నారు. ఆయనే రాజమహేంద్రవరానికి చెందిన డా।। కర్రి రామారెడ్డి. పూర్తి పాఠం..
నడిపించు నా నావ
గాలి అలల మీద అలా తేలుతూ వచ్చే పాట, మనసును ఎక్కడో తాకుతుంది. గుండె కన్నీళ్లను తుడుస్తుంది. తాదాత్మ్యంలోకి తీసుకుపోతుంది. అప్రయత్నంగా మన పెదవులపైనా ప్రతిధ్వనిస్తుంది. తెలుగులో... ముఖ్యంగా భక్తి సాహిత్యంలో ఇలాంటి పాటలు కోకొల్లలు. పూర్తి పాఠం..
కూచిపూడి... నర్తన పద్మకేళి!
సంగీతనాటక అకాడమీ పురస్కారం అందుకోవాలని నృత్య, సంగీత, నాటక కళాకారులందరూ కోరుకుంటారు. దాన్ని సాధించిన నాడు ‘పద్మ’ పురస్కారాన్ని తీసుకున్నంతగా ఆనందపడతారు. కళాకారుల జీవితకాల కృషికి గుర్తింపుగా లభించే ఈ గౌరవాన్ని రెండు తెలుగు రాష్ట్రాల తరఫున కూచిపూడి నాట్యమయూరి డాక్టర్ పద్మజారెడ్డి అందుకున్నారు. పూర్తి పాఠం..
ఒకే ఒక్కడు
తెలుగు సాహితీలక్ష్మి ముమ్మారు జ్ఞానపీఠాన్ని అధిరోహించింది. మన సాహితీస్రష్టలెందరో పద్మ పురస్కారాలను, సాహిత్య అకాడమీ గౌరవాలను అందుకున్నారు. అయినా ఏదో లోటు! దానికోసం మూడు దశాబ్దాలుగా ఎదురుచూపులు. ఆ ఒక్కటీ అందనిద్రాక్షే అవుతోందే అన్న బాధ! పూర్తి పాఠం..
ఆయన వ్యాసుడూ, వాల్మీకీ
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో 1866 అక్టోబర్ 29న జన్మించిన కృష్ణమూర్తి శాస్త్రి సాహితీసేవ ఎనిమిది దశాబ్దాలకుపైగా కొనసాగింది. 1960 డిసెంబరు 29న దేహయాత్ర చాలించే వరకు ఆయన సాహిత్య వ్యవసాయం సాగుతూనే ఉంది. సాహితీ రంగంలో ప్రతిభావంతులు చాలామంది ఉంటారు కానీ, కారణ జన్ముడిగా గుర్తింపు పొందినవారు అరుదు. పూర్తి పాఠం..
మాది కలికి తెలుగు కులము
గత మూడు దశాబ్దాల్లో దేశంలో, తెలుగునాట సంభవించిన సాంఘిక, రాజకీయ పరిణామాల మధ్య గుర్రం జాషువను దళిత కవిగా చూడటం తెలుగువారికి అలవాటైపోయింది. ఆయన కవిత్వంలో దళిత సంవేదన ఒక శక్తిమంతమైన పార్శ్వం. అది చాలా తీవ్రమైంది కూడా. దాన్ని గుర్తించి గౌరవించాల్సిందే. పూర్తి పాఠం..
విదేశాంధ్ర తెలుగు తేజం
ప్రొఫెసర్ జి.కె.గా సుప్రసిద్ధులు గూటాల కృష్ణమూర్తి. కళింగాంధ్ర నుంచి మొదలై, ఖండాంతరాల్లో తెలుగువారి కీర్తిపతాక ఎగరవేసిన సాహిత్య పరిశోధకులు. పూర్తి పాఠం..