సుయోధనుడితో పాచికలాటనా..!
డా।। బి.దామోదరరావు
తల్లిపాల తెలుగు
కె.సుమనశ్రీ
కుదుళ్ల తులసికి గోవిందరామ...
యం.సి. శివశంకరశాస్త్రి
గుడు గుడు గుంచం... గుండే రాగం!
రాయప్రోలు సుబ్బలక్ష్మి
తప్పెటపై తెలుగు దెబ్బ
గణేశ్ బెహరా
సంకురాతిరి పండుగొచ్చె గొబ్బియల్లో
తులసీ బృంద జంపన
నదీనాదాలు
మనుషులు ఆటవిక స్థితి నుంచి క్రమక్రమంగా నాగరికత వైపు అడుగులు వేస్తుంటే, భావవ్యక్తీకరణ అరుపులు, సంజ్ఞల నుంచి పదాలు, మాటల్లోకి మారింది. కాలగమనంలో మౌఖికంగా సాగిన విద్యార్జన ప్రక్రియ మొదట తాళపత్రాలు, తరువాత పుస్తక రూపంలో సాగింది. పూర్తి పాఠం..
జానపద గేయాల సెలయేరు
అక్షర ప్రపంచం విస్తరించని కాలంలోనే, అజ్ఞాత స్వరాల నుంచి అందివచ్చిన సాహిత్య వారసత్వం జానపదుల పాటలు. అలాంటి పాటల సెలయేరు తెలంగాణ. ఇక్కడి జానపదుల పాటల్లో సెలయేటి నీటిలోని తేటతనం కనిపిస్తుంది. తీయదనమూ ఉంది. పూర్తి పాఠం..
ఊర్మిళ నిద్రలేస్తే...!?
కుటుంబమే ప్రపంచానికి ఆధారం. కుటుంబంలో నేర్చుకున్న సంస్కారం, సంస్కృతి విలువలే మానవాళి మనుగడను నిలబెడతాయి. అవకాశం వచ్చినప్పుడు, ఆ విలువల్ని ఓసారి తలచుకుంటే మనమధ్య ఆప్యాయతలు, అనురాగాలు పెరిగి కుటుంబ వ్యవస్థ సుస్థిరమౌతుంది. మనం కోల్పోతోంది ఏంటో గ్రహించినప్పుడే కదా, పరిరక్షించుకునే ప్రయత్నాలు చేయగలం! పూర్తి పాఠం..
సదువునీదే సామునీదే గననాతా
జానపదుల భక్తి గీతాల్లో వినాయకుడి స్తుతి శిష్టసంప్రదాయానికి కాస్త భిన్నంగా ఉంటుంది. భాషలోనూ, భావంలోనూ, అభివ్యక్తిలోనూ స్పష్టమైన తేడా కనిపిస్తుంది. పూర్తి పాఠం..
మా ఇంటి ఇలవేల్పు... మాలోనే వేల్పు
ఇంద్రకీలాద్రిపై ఇసుకేస్తే రాలని సమయమిది... కలకత్తా కాళీఘాట్‌లో కాలుమోపాలన్నా కుదరని కాలమిది... ఆసేతు హిమాచలం అమ్మశక్తి ఆరాధనలో తరించే తరుణమిది. సృష్టికి మూలాధారమైన ‘అమ్మ’ను ఆబాలగోపాలం అర్చించే వేళ దేవీ ఆలయాలన్నీ కిటకిటలాడిపోతాయి. భక్తజన హృదయాలన్నీ దుర్గమ్మకు మంగళహారతులు పాడతాయి. పూర్తి పాఠం..
జగతిపై బతుకమ్మ ఉయ్యాలో శాశ్వతమ్ముగా వెలిసె ఉయ్యాలో
ఈ నేలతల్లి అంతరాత్మ బతుకుతెరువు. జనాన్ని బతకండర్రా అంటూ దీవించడమే దాని సహజ లక్షణం. ఆ కారణంగానే అన్ని ప్రాంతాల వాళ్లనూ కడుపులో (వాళ్ల) చల్ల కదలకుండా కాపాడింది. అదే లక్షణంతోనే పండగలుంటే అందులో ఆశ్చర్యమేముంది. ఆ పండగే ‘బతుకమ్మ’. నేలతల్లి అంతరాత్మకు ప్రతీక ఈ పండగ. పూర్తి పాఠం..
సీతమ్మ.. బతుకమ్మ!
బతుకమ్మ అంటే ప్రకృతి పండగ. పుడమితల్లికి నీరాజనాలర్పించే పూల పండగ. అందుకేనేమో ఆ వసుంధర తనయ కూడా స్వయంగా ఈ పండగ చేసుకుంది. తోడికోడళ్లతో కలిసి బతుకమ్మ ఆడింది. పూర్తి పాఠం..
అలరించే కళారూపం... చిందు
గజ్జెలు కట్టుకున్న కాళ్లు రంగమెక్కి వాయిద్యాలకు అనుగుణంగా పాడుతూ ఆడుతూ ఉంటే... చూసేవాళ్ల కాళ్లు కూడా అప్రయత్నయంగా చిందులేస్తాయి. పాటకు తగ్గ ఆట... ఆటను రక్తిగట్టించే పాటలతో మెరిపించి, మురిపించే ఆ జానపద కళే చిందు యక్షగానం. పూర్తి పాఠం..
కాలి మువ్వల్లోకి గుండె జారిపోయేలా ఉరుముల మెరుపుల దరువులు మొదలెడతారు సందిట కథలను చక్కగా వినిపిస్తారు... అదే యాదవుల సంస్కృతీ పథం తెలుగు జాతి గుండెల్లో తప్పెటగుళ్లు జానపదం. పూర్తి పాఠం..