కాలానికి ముందుమాట గురజాడ బాట
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
అమ్మ పలుకు చల్లన
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
అతిమధురం అన్నమయ్య పదం
డా।। కె.అరుణావ్యాస్
ఆముక్తమాల్యదలో వేసవి వెన్నెల
జూటూరు కృష్ణవేణి
ఆ తెలివి తెలుగుతోనే సాధ్యం
వై.తన్వి
ఎల్లలు దాటిన కోస్తాంధ్ర కథ
డా।। కాకుమాని శ్రీనివాసరావు
నైతిక విలువలు ఉంటేనే విలువ
బాల్యానికి సంకెళ్లు పడుతున్నాయి. కాదు... కాదు... బాల్యమే ఏరికోరి సంకెళ్లను బిగించుకుంటోంది. తల్లిదండ్రుల హృదయాలను, పాఠ్యపుస్తకాల దొంతర్లను కాలదన్ని జువనైల్ హోములవైపు కదిలిపోతోంది. దొంగతనం, అత్యాచారం, హత్య... విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతూ తనను తానే చిదిమేసుకుంటోంది. పూర్తి పాఠం..
కొంగ కొంగే... హంస హంసే!
సమర్థుడైన కవి చెప్పిన ప్రతి మాటా పాఠకుల మనసుల్ని పరవశింపజేస్తుంది. ఎంత బాగా చెప్పాడని పదేపదే అనుకుంటాం. ఆనందిస్తాం, ఆలోచిస్తాం. ఇతివృత్తం ఎలాంటిదైనా కవికి దానితో పనిలేదు. కవి సమాధినిష్ఠుడై వస్తువును చక్కగా భావిస్తే రసభావం పొందని పదార్థం ఈ లోకంలో ఉండదు. పూర్తి పాఠం..
జన సంక్షేమమే దేశానికి రక్ష
వర్షాలు లేక పంటలు పండనప్పుడు ప్రజలు పన్నులెలా కడతారు! దుర్బరమైన కరవు పరిస్థితులప్పుడు కూడా పన్నుల కోసం వేదించడం నైతిక ధర్మం కాదు. తుమ్మెద పూవు నుంచి మకరందం సేకరించినట్టుగా ప్రజల నుంచి పన్ను వసులు చేయాలే గానీ దౌర్జన్యం చేయడం న్యాయసమ్మతం కాదంటారు కృష్టదేవరాయలు ఆముక్తమాల్యద కావ్యంలో. పూర్తి పాఠం..
మన పద్యం... ఎంతో హృద్యం!
భాష- గుర్రమైతే, భావం- రథం, కవి- సారథి, ఛందస్సు- రాజమార్గం. అంటే కవి సారథిగా ఉండి, భావరథానికి భాష అనే గుర్రాన్ని పూన్చి ఛందో రాజమార్గంలో హేలగా నడిపించటమే పద్యం. ఈ మార్గం మీద పయనించడానికి ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి. అభ్యాసం లేనివాళ్లు, నేర్పరులు కానివాళ్లు పద్యరథాన్ని సరిగా నడపలేరు. పూర్తి పాఠం..
హస్తినలో పురివిప్పిన తెలుగు పద్యం
సాహితీప్రియులకు అవధానం సురుచిరం. పృచ్ఛకులు సంధించే సమ్మోహనాస్త్రాలను అవధాని ఎంత సమర్థంగా ఎదుర్కొంటే సదస్యులు అంత మైమరచిపోతుంటారు. నిజానికి పద్యప్రక్రియని ప్రదర్శనకళగా మార్చిన ఘనత అవధానాలదే! పూర్తి పాఠం..
వస్తావట్టిది... పోతావట్టిది
ఎంత తినాలి? ఎంత సంపాదించాలి? ఎన్ని తరాల కోసం కూడబెట్టాలి? ఈ ఆలోచనలతోనే కొంతమంది జీవితాలు ముగిసిపోతాయి. తరాలు కూర్చుని తిన్నా తరగని సంపదను వెనకేసి కూడా ఇంకా ఏదో పేరాశతో పరిగెత్తేవారు చివరికి మిగుల్చుకునేదేంటి? పూర్తి పాఠం..
హాస్యవీరుడి వీరంగం
తెలుగుసాహిత్యంలో హాస్యం అనగానే మొట్టమొదట గుర్తుకువచ్చే కవి తెనాలి రామలింగడు, అలియాస్ తెనాలి రామకృష్ణుడు. ఈ విషయంలో ఆయనకు సాటిగానీ పోటీగానీ ఇంకొకరు లేరు. చిత్రమేమిటంటే ఇంతటి హాస్యమూర్తి తిక్కరేగితే ఉగ్రనరసింహుడవుతాడు. వీరంగమాడతాడు. ఏమాత్రం ముందూ వెనకా ఆలోచించడు. పూర్తి పాఠం..
నవ వసంతాల వెలుగు...తెలుగు!
నూటయాభై మందికి పైగా కవులు ఒకేచోట కలిస్తే... అనేక ప్రాంతాల తెలుగు నుడికారాన్ని తమ కలంలోకి ఆవాహన చేసుకుని కవితలు అల్లితే... వాటిని సుమధురంగా వినిపిస్తే... కవితా వసంతం వెల్లివిరిసినట్లుండదూ! పూర్తి పాఠం..
సీమ నవలల కళకళలు!
పాశ్చాత్య సాహిత్యం ప్రభావంతో భారతీయ భాషల్లోకి ప్రవేశించిన ప్రక్రియ నవల. భారతీయ నవలా పితామహుడిగా పేరుగాంచిన బంకించంద్ర ఛటర్జీ రాసిన ‘దుర్గేశనందిని’ని తొలి భారతీయ నవలగా సాహిత్య చరిత్రకారులు పరిగణిస్తున్నారు. పూర్తి పాఠం..