జ్ఞానపీఠాన్ని అధిష్ఠించిన భరద్వాజుడు
వినయ్‌కుమార్
పాటల వేటూరి మాటల చాతురి
రాంభట్ల నృసింహశర్మ
అమ్మభాషకు గొడుగు గిడుగు
పి.స్నేహలతా మురళి
తెల్లవాడు... మన నిఘంటు రేడు
జానమద్ది హనుమచ్ఛాస్త్రి
ఇంటిల్లిపాది కవులే
లగడపాటి వెంకట్రావు
అందరి గొడవ కాళోజీ గొడవ!
ఎ.సుబ్రహ్మణ్యం
శ్రీశ్రీకి ‘వంద’నాలు అశోక్ కుమార్ మహా యజ్ఞం
ఎవరైనా కవి, రచయిత మీద అభిమానం ఉంటే ఏం చేస్తాం. ఆయన పుస్తకాలన్నీ కొనుక్కుని చదువుతాం. వాటిని భద్రంగా దాచుకుంటాం. మరీ వీరాభిమానం ఉంటే మన స్నేహితులకి బహుమతిగా ఆ పుస్తకాలు కొనిస్తాం. కానీ, ఆయన రాసిన, ఆయన మీద వచ్చిన పుస్తకాల ముద్రణ భారం స్వచ్ఛందంగా భుజాన వేసుకుంటే! పూర్తి పాఠం..
ప్రకృతివైద్య జ్ఞానసింధువు.. రామేశ్వర నిఘంటువు!
‘‘మట్టిపట్టీలు, తొట్టిస్నానాలు...’’ ఈ పదాలు అర్థమయ్యీ అవనట్లున్నాయి కదా! ‘ప్రకృతి వైద్య చికిత్స’లో పలికే మాటలివి. ‘ప్రకృతి వైద్యం’ అంటే నీరు, ఆహారం, యోగా, వ్యాయామం, ప్రకృతి జీవన విధాన పద్ధతులతో రోగనివారణ చేసే ప్రక్రియ. పూర్తి పాఠం..
సాహితీ భారతికి లక్ష్మీకాంతి
‘‘నాకు వేరే జపమూ, తపమూ లేవు. సాహిత్యమే నా సాధన, కవిత్వమే యోగం’’ అంటూ సాహిత్యం కోసమే జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి పింగళి లక్ష్మీకాంతం. పింగళి-కాటూరి జంట కవుల్లో ఒకరైన లక్ష్మీకాంతం అధ్యాపకుడిగా, కవిగా, భాషా పరిశోధకుడిగా, విమర్శకుడిగా, నటుడిగా అసమాన ప్రతిభా విశేషాలను విస్తరింపజేశారు. పూర్తి పాఠం..
భావకవిత్వం... కృష్ణశాస్త్రీయం
‘ఇక్షు సముద్రం ఎక్కడుందో నాకు తెలియదు... కృష్ణశాస్త్రి సాహిత్యం సమస్తమూ ఇక్షు రసార్ణవమే! దాని జాగ్రఫీ జోలికి వెళ్ళదలచుకోనునేను... ఇదే అసలు సిసలైన చెఱకు రసాలకడలి. రండర్రా, ఆస్వాదించుదాం’ అంటారు శ్రీశ్రీ. పూర్తి పాఠం..
తెలుగు చలనచిత్ర చరిత్రకారుడు
ఆయన, తెలుగు సినిమా ఇంచు మించు ఒకే ఈడు వాళ్లు! కలిసి నడిచారు.. కబుర్లు కలబోసుకున్నారు. కదిలే బొమ్మలకు కళ్లప్పగించిన అభిమాన ప్రేక్షకుడిగా మొదలైన ఆయన ప్రయాణం- రంగస్థలం ద్వారా సాగి, సినిమా రంగంలో స్థిరపడింది. తెర వెనక, తెర పైన రకరకాల విభాగాల్లో నడిపించింది. పూర్తి పాఠం..
హరికథకు ఆదిభట్టు అచ్చ తెలుగుకు ఆయువు పట్టు
తెలుగు వారు ముగ్ధులై ఏ మహితాత్ముణ్ని తిలకించి, పులకించి, స్పందించి అభినందించారో ఆ సంగీత సాహిత్య సార్వభౌముడు హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు. ఈ మాట కరుణశ్రీదే కాదు యావత్ తెలుగు జాతిది. పూర్తి పాఠం..
పుస్తకాలే పంచప్రాణాలు
రోడ్డు మీద నలుగురి మధ్య ప్రత్యేకంగా చూస్తేనేగాని ఆయన్ని గుర్తుపట్టే అవకాశం లేదు. వెదికి పట్టుకుంటేగాని ఆయన ప్రత్యేకత తెలియదు. ఏమీ సరకులేని డొల్లలు మనకి నాయకత్వం వహిస్తూ మనల్ని కాల్చుకు తినే నేపథ్యంలో ఇలాంటి వ్యక్తులు మణిపూసలు. వివరణకి ముందు విశ్లేషణతో ప్రారంభించడం అన్యాయం. ఇప్పుడు మొదట్నుంచీ కథ. పూర్తి పాఠం..
సంస్కరణ కవితా విపంచి
మనిషిలోని నిజమైన మనిషిని తట్టి లేపుతూ సమాజంలో మానవతా దీపాన్ని వెలిగించేలా నిత్య అక్షర ప్రవాహమై సాగుతున్న కవి డాక్టర్ తిరునగరి రామానుజయ్య. వచన కవిత్వం, పద్యం, గేయం, విమర్శ ఏది రాసినా మనసుల్ని విశాలం చేసే లక్ష్యంతో సాగుతుంది ఆయన కలం. పూర్తి పాఠం..
ఓ దార్శనికుడు
పాములపర్తి వెంకట నరసింహారావు అంటే దేశం తలరాతను మార్చిన పరిపాలనాదక్షులు మాత్రమే కాదు! సాహితీక్షేత్రంలో బంగారు పంటలు పండించిన అక్షర హాలికులు కూడా. రాజకీయాల్లో తీరికలేకపోయినా అమ్మభాష, రచనలకు ఎప్పుడూ చేరువలోనే ఉన్న పీవీ.. అచ్చతెలుగు ఠీవీ! పూర్తి పాఠం..