ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు...
డా.పి.శశిరేఖ
ఇద్దరూ ఇద్దరే
ఆ అయిదుగురు
క్రాంతిదర్శి... సాహితీ రుషి
జ్ఞాన శిఖరం
అలుపెరగని అక్షర శ్రామికుడు
రామకృష్ణ
ఆయనొక అద్భుతం!
సహజ నటనతో, అద్భుత వాచకంతో అటు రంగస్థలం మీదా, ఇటు వెండితెర పైనా తనకు తనే సాటి అనిపించుకున్నారు రాళ్లపల్లి. పాత్ర ఏదైనా అందులోకి పరకాయప్రవేశం చేసే ఆయన తెలుగు ప్రేక్షకులను దశాబ్దాలపాటు రంజింపజేశారు. మంచి రచయిత కూడా అయిన రాళ్లపల్లి.. వ్యక్తిత్వంలో మేరు సమానులు. పూర్తి పాఠం..
‘మందహెచ్చుల’ మణిపూస
తుది శ్వాస వరకు జీవితాన్ని మందహెచ్చుల కళకు అంకితం చేసిన అరుదైన జానపద కళాకారుడు కడెం సమ్మయ్య. పదకొండో ఏటనే కాలికి గజ్జకట్టి వారసత్వంగా వస్తున్న మందహెచ్చుల కళలోకి అడుగుపెట్టారు. అంకితభావం, ఉత్తమ ప్రతిభాపాటవాలతో దేశ వ్యాప్తంగా మందహెచ్చుల కళలో తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్నారు. పూర్తి పాఠం..
సాహితీ సత్యాన్వేషి
తెలుగు సాహిత్యంలో అనుభూతి కవిత్వానికి సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రముఖకవి, రచయిత, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. 1944, మే 29న తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రాపురం గ్రామంలో జన్మించారు. భార్య ఇంద్రగంటి జానకీబాల, కొడుకు ఇంద్రగంటి మోహన కృష్ణ. పూర్తి పాఠం..
నిరంతర అక్షర ప్రేమికుడు
కథా రచయితగా, నవలాకారుడిగా, సాహితీ విమర్శకుడిగా, పద్య నాటక రచయితగా సాహిత్య రంగంలో పలు ప్రక్రియల్లో ప్రతిభను చాటుకున్నారు డా।। ఎన్.రామచంద్ర. కడపజిల్లా పులివెందుల తాలూకా రామిరెడ్డిపల్లెలో 1939 నవంబరు 12న ఆయన జన్మించారు. పూర్తి పాఠం..
నింగికెగసిన దిగంబర కవితాస్వరం
1960లో సాహిత్యలోకంలోకి పెనుతుఫానులా విరుచుకుపడ్డ దిగంబర కవుల్లో మహాస్వప్న ఒకరు. ‘‘నేను వస్తున్నాను దిగంబరకవిని!’’ అంటూ... దిగంబర కవితాశకానికి శంఖారావం పూరించిన మహాస్వప్న అసలు పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. పూర్తి పాఠం..
ఆచరణవాది
శ్రీఅన్నమార్య చరణౌ శరణం ప్రపద్యే’’ అంటూ శ్రీవేంకటేశ్వరుని పరమభక్తుడైన అన్నమాచార్యులవారిని స్తుతిస్తూ సుప్రభాతం రచించిన వేదవ్యాస రంగభట్టర్ కూరత్‌ఆల్వార్ వంశానికి చెందినవారు. రంగభట్టర్ 75 సుప్రభాతాలు రచించారు. పూర్తి పాఠం..
వైవిధ్య నటనా కేతనం
పూజారి పాత్రలో స్పష్టమైన ఉచ్చారణ, ప్రస్ఫుటమైన హావభావాలతో ప్రేక్షకుల అభిమాన నటుడయ్యారు డీఎస్ దీక్షితులు. పూర్తిపేరు దీవి శ్రీనివాస దీక్షితులు. ఆయన రంగస్థల నటులు, టీవీ ధారావాహికలు, నాటకాల దర్శకులు కూడా. స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు. పూర్తి పాఠం..
సాహితీ యోధుడు
నాలుగున్నర దశాబ్దాలకు పైగా తెలుగు సాహితీ విమర్శలో అలుపెరగని కృషి చేసిన ప్రతిభామూర్తి ద్వానా శాస్త్రి. ఆయన పూర్తిపేరు ద్వాదశి నాగేశ్వర శాస్త్రి. సాహితీ సవ్యసాచిగా పేరుపొందిన ఆయన కృష్ణాజిల్లా లింగాల గ్రామంలో 1948 జూన్ 15న జన్మించారు. పూర్తి పాఠం..
మలిపొద్దు కవి ప్రభాకరుడు
సమాజంలో అచ్చమైన, స్వచ్ఛమైన ఆదర్శమార్గానికి బాటలేసిన ఆత్మగల్ల కవి ఆడెపు నారాయణ. ఈయన వచన కైతలు సదివితె బతుకు మీద ఆశలేనోడు సైతం సమాజసేవకు నడుం బిగిస్తడు. నారాయణ యాభై ఏండ్ల అనుభవ అక్షర తూటాలు బతుక్కు భరోసానిస్తయి. మనసుకు సూటిగా తాకుతయి. పూర్తి పాఠం..