తెలంగాణ జాతీయ గ్రంథాలయం
సన్నిధానం నరసింహశర్మ
పొత్తాల నిధి అది సజీవ ‘గౌతమీ’ నది!
శతకీర్తి
‘విజ్ఞానపు వేట’పాలెం
జి.శ్రీరాములు
పాఠక జ్ఞానపీఠ వారధులు గ్రంథపాలకులు
గ్రంథాలయాలకే గ్రంథాలయం
తెలుగు పుస్తకాలు కావలెను!
డా।। ఎ.ఎ.ఎన్.రాజు
విజ్ఞానజ్యోతుల వెలుగులో సమాజ భవిష్యత్తుకు పసిడి బాటలు పరిచేవి గ్రంథాలయాలే. సమర్థులైన గ్రంథపాలకుల సారథ్యంలోనే ఆమేరకు అవి రాణించగలవు. కానీ, ప్రస్తుతం గ్రంథాలయ సమాచారశాస్త్ర విద్యార్థుల చదువుల్లో ఆంగ్లమాధ్యమానిదే ఆధిపత్యం! పూర్తి పాఠం..
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అపురూప వస్తు, కళాఖండాలకు నిలయం హైదరాబాదు సాలార్జంగ్ మ్యూజియం. ఇంచుమించు దానికి ఎదురుబొదురుగా- మూసీనదికి ఆవల అఫ్జల్‌గంజ్‌లో ఓ గ్రంథ కళాఖండాల నిలయం. పూర్తి పాఠం..
‘ఉపాధ్యాయులు ఉత్తేజితుల్ని చేస్తారు. గ్రంథపాలకులు ఆ ఉత్తేజాలకు సంపూర్ణత్వం సిద్ధింపజేస్తారు’ అంటారు అమెరికన్ నవలా రచయిత రే బ్రాడ్బ్యురీ. నిజమే... పొత్తపుగుడి ఏలికలంటే చదువరుల, ఎరుకపీటల వంతెనలే. వాళ్లు పొత్తపుగుళ్ల పూజారులు. అలాంటి వ్యవస్థకు భారతదేశంలో పునాదులు వేసి, గ్రంథాలయశాస్త్రాన్ని... పూర్తి పాఠం..
అక్కడ... ఆ వేటపాలెం ‘సారస్వత నికేతనం’లో లభించనిది అరుదు! ఎందుకంటే... ‘సమగ్రాంధ్ర సాహిత్యా’నికే అది మూలాధారం. తొంభై ఏడేళ్ల ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రకు ప్రత్యక్షసాక్షి ఆ గ్రంథాలయం. ఈ శతాబ్ది కాలంలో ఆ అక్షరాంబుధిని వేలాది మంది మథించారు. వెలకట్టలేని విజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారు. పూర్తి పాఠం..
వందేళ్ల విజ్ఞాన ప్రకాశం
నూరేళ్ల చరిత్ర కలిగిన పొత్తపుగుడి అది. నిజాం నిరంకుశత్వాన్ని నిరసిస్తూ ప్రజలను సంఘటితం చేసిన ఘనత దానిది. అధిక సంఖ్యాకుల అమ్మభాషకు రాజాదరణ కొరవడిన ఆ కాలంలో కమ్మటి తెలుగులో విజ్ఞాన వీచికలు పంచిందా పుస్తకాలయం. పూర్తి పాఠం..
తాళపత్రాలకు సాంకేతిక దన్ను
ఎన్నో తాళపత్రాలకు నెలవు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లోని ప్రాచ్య పరిశోధనా సంస్థ. తన పరిధిలోని ప్రాచ్య పరిశోధనా సంస్థ (ప్రాపస)లో ఉన్న తాళపత్రాల డిజిటలీకరణకు శ్రీకారం చుట్టింది. పూర్తి పాఠం..
‘శతాబ్దాల చరిత గల సుందరనగరం, గత వైభవదీప్తులతో కమ్మని కావ్యం’గా రాజమహేంద్రిని అభివర్ణించారు ఆరుద్ర. జలనిధుల గౌతమీ నది రాజమహేంద్రవరం చెంత ఒక విశాల దృశ్యం. జ్ఞాన నిధుల గౌతమీ గ్రంథాలయం జనవరంగా ఆ నగరిలో ఒక వికాస దృశ్యం! పూర్తి పాఠం..
తెలుగు భాషా సంస్కృతుల ఉద్యమ స్ఫూర్తితో స్థాపించిన ఆ గ్రంథాలయం ఎంతోమంది గొప్పవాళ్లకు మార్గదర్శిగా నిలిచింది. నిజాం రాజుకు వ్యతిరేకంగా సాగిన హైదరాబాదు రాష్ట్ర స్వాతంత్య్రోద్యమంలో దీని పాత్ర చిరస్మరణీయం. తెలుగుగడ్డ మీద ఇప్పటికీ కాంతులీనుతున్న ఆ తొలితరం గ్రంథాలయమే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం. పూర్తి పాఠం..
జానపద వాఙ్మయ సిరి
పల్లెప్రజల బతుకు పరిమళానికి, ఆచార వ్యవహారాలకు ఆలవాలం జానపద వాఙ్మయం. దాన్ని తెలుసుకోవడమంటే మన మూలాలను మనం తడుముకుని మురిసిపోవడమే. మన పూర్వీకుల జీవితానుభవ సారాన్ని అవలోకించి ఉప్పొంగిపోవడమే. పూర్తి పాఠం..