యాత్రా చిత్రం
తెలుగు వెలుగు బృందం
మనోచైతన్య జ్వాల
డా।। తన్నీరు సురేశ్
కాల దోషం పట్టని ‘కీలుబొమ్మలు’
విహారి
నీతికవి చౌడప్ప!
పురాణం త్యాగమూర్తిశర్మ
గోండుల రగల్ జెండా కొమురం భీము
స్వతంత్రోద్యమ భారతం
యామనూరు శ్రీకాంత్
మనసు మాయాజాల మర్మాన్ని ఛేదించి, సాధించిన అక్షరవేత్తల సృష్టి చైతన్య స్రవంతి. దానికి అంకితమై రచనలూ, జీవితాన్నీ కొనసాగించిన దార్శనిక సృజనశీలి వడ్డెర చండీదాస్. అసలు పేరు చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు పూర్తి పాఠం..
ఇతర భాషలతో పోలిస్తే తెలుగు సాహిత్య ప్రక్రియలలో వైవిధ్యం అపారం. యాత్రా స్మృతుల విషయంలో మాత్రం తెలుగు సాహితీ సంపద బలహీనమైందే. 1838లో ఏనుగుల వీరాస్వామయ్య ‘కాశీయాత్ర చరిత్ర’ వెలువడేదాకా తెలుగులో యాత్రా స్మృతి ప్రక్రియే లేదు. ఆ తరువాత 176 ఏళ్లలో వచ్చిన యాత్రా స్మృతులూ 150కి లోపే. పూర్తి పాఠం..
చారిత్రకం.. రసమయం
అఖండ తెలుగు చరితకు రసాక్షర కావ్యం మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి ‘ఆంధ్రపురాణం’. అనేక శతాబ్దాల పాటు జాతి నడచివచ్చిన తోవల మీద సాహితీ వెలుగురేఖలు ప్రసరింపజేస్తూ మధునాపంతుల సృజించిన అనుపమాన కావ్యమిది. పూర్తి పాఠం..
నెత్తుటి పూల వసంతం!
వెలివాడ బతుకుల్లో కూడా సాహిత్యం ఉంది. చిత్రలేఖనం ఉంది. నాటకం ఉంది. ఈ ప్రపంచం చూడటానికి ఇష్టపడని చాలా అందాలు అందులో ఉన్నాయి. అయితే అవన్నీ అంటరాని వసంతాలు. ఈ భూమ్మీద కురిసి వెలిసిన వెలి కదలికలు. పూర్తి పాఠం..
బహుముఖీన సాహితీ సృజన చేసిన జి.వి.కృష్ణారావుకు ‘కీలుబొమ్మలు’ నవల బాగా పేరు తెచ్చింది. సాధారణ పాఠకులతోపాటు విమర్శకుల ప్రశంసలనూ అందించింది. పూర్తి పాఠం..
వాళ్లు అడవితల్లి బిడ్డలు. ఎటుచూసినా పచ్చదనమే, స్వచ్ఛమైన నీళ్లు, ఎత్తైన కొండలు వీటి మధ్య స్వేచ్ఛగా జీవితం గడుపుతారు. అలాంటిది అడవి మీది కాదంటూ పరిమితులు విధించి, పన్నులు బాదితే ఎలా ఉంటుంది...? పచ్చటి అడవిపై ఎర్రరంగు పులుము కుంటుంది. నిజాంరాజుకు వ్యతిరేకంగా జరిపిన గోండుల పోరాటం ఇలాంటిదే. పూర్తి పాఠం..
చౌడప్ప శతకం అనగానే హవ్వ! అదా అని అనుకున్నా తెలుగు వారికి అందులో ఒక్క పద్యమైనా, కనీసం ఒక్క పాదమైనా తెలియకుండా ఉండదు. అలా అని ఈ శతకం అంతా బూతే ఉంటుందనుకుంటారేమో! ఇందులో లోక ఖ్యాతులైన నీతులూ ఉన్నాయి. పూర్తి పాఠం..
పారతంత్య్రాన్ని నిరసించి తెలుగువారిలో స్వాతంత్య్రేచ్ఛను రగుల్కొల్పిన మహాకావ్యం ‘శ్రీశివభారతము’. దాని సృష్టికర్త గడియారం వేంకట శేషశాస్త్రి. వసంత వనాల్లో మామిడి చెట్ల కొమ్మల నుంచి పంచమ స్వరంలో ఆయన చేసిన కావ్య కవితాగానం తెలుగునేలను అలరించింది. పూర్తి పాఠం..
కాశీ చేరుతున్న మజిలీ కథలు
చదువుతున్నంత సేపూ ఏదో ఉత్కంఠ! కథలోని పాత్రలతోపాటు మనమూ ఎక్కడెక్కడికో వెళ్లిపోతూ ఉంటాం. మనకు తెలియకుండానే ఏ రాకుమారుడో లేదా రాకుమార్తో మనలో పరకాయ ప్రవేశం చేస్తారు. అక్కడి నుంచి మన విహారమంతా మధురమైన ఊహాజగత్తులోనే! పూర్తి పాఠం..