ఒక్కో సామెత... ఒక్కో కథ
చొప్పదండి సుధాకర్
పదమదే అర్థం వేరే
అయ్యగారి శ్రీనివాసరావు
కలికి గాంధారి వేళ...
వెలగా వెంకటప్పయ్య
ములుకోల ఆడితే...
డా।। కపిలవాయి లింగమూర్తి
శబ్దానికి అనుకరణ... మాటకు అలంకరణ
కాకి కథ
ఎ.ఎ.విజయకుమార్
మార్పు చెందడం ప్రకృతి సహజం. కాలగమనంలో ఎన్నెన్నో ఎన్నో రకాలుగా మార్పులకు గురవుతూనే ఉన్నాయి. కొత్తవి ఉద్భవిస్తూనే ఉన్నాయి. దీనినే ‘పరిణామక్రమం’ అంటారు. ఇది భాషకూ వర్తిస్తుంది. పూర్తి పాఠం..
మూరెడు పొంగటం ఎందుకు... బారెడు కుంగటం ఎందుకు! పూర్తి పాఠం..
మునుముకో ముద్దు!
ప్రతి భాషా సమాజంలోనూ ఆ భాషకే ప్రత్యేకమైన పలుకుబడులుంటాయి. వీటినే నుడికారాలనీ, జాతీయాలనీ అంటారు. వీటి వాడకంతో ఆయా రచనలకు అద్భుత అందాన్ని తీసుకురావచ్చు. భాషలకు ఇవి ప్రత్యేక సంపదలు. పూర్తి పాఠం..
మొయ్యర మోత... బీరపూల వాయిదా!
భాషకు అందాన్నీ, లోతైన భావాన్నీ, సమగ్రతనూ ఇస్తాయి పలుకుబళ్లు, నానుళ్లు, జాతీయాలు, సామెతలు. పాయసంలో జీడిపప్పులాగ సందర్భాన్నిబట్టి మాటల మధ్యలో తగులుతూ భాషను సుసంపన్నం చేసే పలుకుబళ్లు తెలంగాణలో విరివిగా వినిపిస్తాయి. ఒక్కసారి వాటిలోని సౌందర్యాన్ని, అర్థరమణీయతను అవలోకిస్తే... పూర్తి పాఠం..
ఇంట్లో బియ్యం అయిపోతాయి. ఇంటావిడ ఇంట్లో బియ్యం నిండుకున్నాయండీ అంటూ బియ్యం లేవనే విషయాన్ని నర్మగర్భంగా చెబుతుంది. ఇలా నిత్య జీవితంలో జాతీయాల వాడుక లేకుండా మాట్లాడలేం. అది జాతీయమని తెలియకపోవచ్చు. అయినా ప్రయోగిస్తాం. భావ వ్యక్తీకరణను అందంగా, సొగసుగా మార్చేవి మన జాతీయాలు. పూర్తి పాఠం..
కాడెద్దులు కదలాలంటే... బండి ముందుకు నడవాలంటే ఒకప్పుడు ములుకోల ఆడాల్సిందే. సాగులోనైనా, ప్రయాణంలోనైనా మట్టిమనుషులకు నేస్తంగా నిలిచిన ఆ కోల ఇప్పుడు కనపడట్లేదు. పూర్తి పాఠం..
పిల్లోడి ఒళ్లు జ్వరంతో సలసలా కాగిపోతోంది. ఏమయ్యా... ఆ మందుబిళ్లలు పట్రా! దడదడలాడుతున్న గుండెతో కేకేసింది భార్య. బిడ్డ బాధ చూసి అప్పటికే ఆ అయ్య కళ్లమ్మెట బొటబొటా నీళ్లు రాలుతున్నాయి. ఇల్లాలి కేకతో లోకంలోకి వచ్చి చరచరా బయటకు పోయాడు. పూర్తి పాఠం..
తిమ్మడు...కోతిమ్మడు
తిమ్మడు శబ్దానికి కోతి అని శబ్దరత్నాకరం అర్థమిస్తోంది. ఈ శబ్దాన్ని ‘తిరుమల + డు’ అని విడమరిచి కూడా చెబుతోంది. అలా విడమరచినప్పుడు ‘తిరుమల + డు’ అంటే తిరుమల దేవర వెంకటేశ్వరుడు అవుతున్నాడు. ఆ స్వామిని ‘తిమ్మప్ప’ అంటూ మూర్తికవి ‘రాజవాహన విజయం’లో చెప్పి ఉన్నాడు. పూర్తి పాఠం..
తెలుగు తెలివికి పొద్దు ‘పొడుపు’
మానవ మనోవికాసం బాల్యావస్థలో ఉన్నప్పుడే జానపదులు సృష్టించుకున్న కూటరచనలు పొడుపుకథలు. సామెతల మాదిరిగానే ఇవి చాలా వరకు ఏకవాక్య నిర్మితాలు. హాస్యస్ఫోరకాలు. ఊహాతీతంగా ఉండి గూఢమైన జవాబు తెలియగానే ఎదుటివారికి దిగ్భ్రమను కలిగించడం పొడుపుకథ స్వభావంగా చెప్పారు ఆర్వీయస్ సుందరం. పూర్తి పాఠం..