‘పొట్టా’భిషేకం
శంకరనారాయణ
పశుజన్మ దుర్లభం
బుడ్డిమంతులూ!జిందాబాద్
నీ తెలుగు ఇంగ్లీషుగాను
అసురా! శహభాషురా!
పెళ్లెందుకు దండగ? ప్రేమించుకుంటే పండగ
పాపాము చేయమురా నరుడా!
మనిషి పుట్టినప్పటి నుంచీ చచ్చేంత వరకు ఒకటే కోరిక ‘నిండు నూరేళ్లు బతకాలని’! ఇంకా అవకాశం ఉంటే ‘సెంచరీ-నాటౌట్’ అనిపించుకోవాలని! ఇందుకోసం మనిషి ఏం చేయడానికైనా వెనకాడడు. అయితే ఇందుకు తిరుగులేని మార్గం ఉంది. పూర్తి పాఠం..
దేశమంటే అప్పులోయ్
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ అప్పారావు దేశభక్తి గీతంలో ‘దేశమంటే అప్పులోయ్’ అని ఉంటే అదిరిపోయేది. ‘అప్పుడప్పుడూ అవసరమైంది అప్పూ, డప్పూ’ అన్నాడొక కవి. ఏరకంగా చూసినా మనుషులు రుణగ్రహీతలే. మనిషి అంటే అప్పుల అప్పారావు. పూర్తి పాఠం..
నీరసమే ప్రధాన రసం
‘ప్రాగ్వి పశ్చిన్మతంబున/ రసము వేయిరెట్లు గొప్పది... నవకథా ధృతిని మించి’’ అన్నారు, తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. పూర్తి పాఠం..
అనేక పత్నీవ్రతం
ఏకపత్నీవ్రతమా? అది మంచిదైతే చెప్పండి స్వామీ! ఎంత ఖర్చయినా చేస్తాను. ఎన్ని గంటలైనా కదలకుండా కూర్చుంటాను’ అని నిష్ఠాగరిష్ఠుడైన ఓ వ్యక్తి ఏకపత్నీవ్రతం గొప్పదనం మీద ఓ స్వామీజీ ప్రసంగాన్ని విని నొక్కి వక్కాణించాడట. పూర్తి పాఠం..
మహిళానాం రోదనం బలం
‘బాలానాం రోదనం బలం’ అన్నారు. పిల్లలకు ఏడుపే బలమట! ఎంత మాట!! పుట్టినప్పుడు ఏడ్చినంత మాత్రాన, పిల్లల్ని అలా అంటారా? వాళ్లకు భాష రానంత మాత్రాన అలా అంటారా? పూర్తి పాఠం..
ఒక్కొక్కరి మొహం చూస్తే పెట్ట బుద్ధవుతుంది. ఒక్కొక్కరి మొహం చూస్తే కొట్టబుద్ధవుతుంది అంటారు. ఇది నిజమే. అదేంటో గానీ ఎన్నితప్పులు చేసినా దేవతలను పొగడాలని, ఎన్ని ఒప్పులు చేసినా రాక్షసుల్ని చెడ తిట్టాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. పూర్తి పాఠం..
పెళ్లి పెళ్లి అని కుర్రకారు అంతా ఎందుకు అంత వెర్రిగా కలవరిస్తుంటారు? కల.. వరిస్తుంటారు. దాని కోసం ఎందుకంత తాపత్రయం? దానికి బదులుగా ప్రేమిస్తూ, ప్రేమిస్తూ ఉంటే ఎంచక్కగా ఏండ్లూ పూండ్లు గడిపేయవచ్చు. పూర్తి పాఠం..
జంతూనాం నరజన్మ దుర్లభం అంటారు. అన్ని ప్రాణుల్లోకి నరజన్మ పొందడం దుర్లభమట! ఎందుకయ్య నరజన్మ? పుడుతూనే ఏడవడం. మనిషి జన్మ మంచిదైతే కన్ను తెరవగానే కొంప మునిగినట్టు ఎందుకు ఏడుస్తాడు? నిజానికి పశుజన్మ దుర్లభమైంది. పూర్తి పాఠం..
ఆనాటి పెద్దలకు ముందుచూపు లేకుండా పోయింది. తెలుగు జనం బాగుపడాలన్న కోరికే వారికి కొరవడింది. లేకపోతే పనిగట్టుకుని, పెన్నుపట్టుకుని తొలి తెలుగు భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు ఏర్పాటు చేశారు? వాళ్లమీద అవిశ్వాసతీర్మానం పెట్టడానికి ఇప్పుడు అవకాశం కూడాలేదు. అది దురదృష్టం. పూర్తి పాఠం..