సినీ సం‘గీత’ క్రాంతి
జ్యోతి వలబోజు
‘ఘన’తంత్రం ఎప్పుడో?
తెలుగు వెలుగు బృందం
కలికి చిలకల కొలికి
సూరంపూడి పవన్ సంతోష్
మళ్లీ పరుండేవు లేరా!
పీడను వదిలించుకుందాం
పరవస్తు నాగసాయిసూరి
జీవితమే ఒక దీపావళి
డి.కస్తూరి రంగనాథ్
నల్లనయ్య నిద్దరోతున్నాడు. జగమేలు స్వామి జగాన్ని మరచి మరీ కునుకు తీస్తున్నాడు. ఘడియలు గడుస్తున్నాయి. ఎండదొర ఏడుగుర్రాలెక్కే వేళ కావస్తోంది. అయినా... కన్నయ్య కళ్లు తెరవట్లేదు. లే నాయనా అంటూ యశోదమ్మ తట్టిలేపుతున్నా ఆ యదువంశ విభుడు వినట్లేదు. ‘మేలు కొలుపు’ పాడితే తప్ప మంచం దిగేలా లేడు. పూర్తి పాఠం..
ఎందరు బిడ్డల్ని కన్న తల్లయినా అమ్మ ఒడిలో పసిపాపే. ఎన్ని వ్యవహారాలు దిద్దుకునే ఇల్లాలైనా నాన్నకు గారాలపట్టే. అలాంటి ఆప్యాయతలకూ, అనురాగాలకూ ప్రతిరూపం పుట్టిల్లు. అక్కడికి వెళ్తున్నాననే ఆలోచన రాగానే నలభయ్యేళ్ల ఇల్లాలైనా పదిహేడేళ్ల పడుచైపోతుంది పూర్తి పాఠం..
తెల్లదొరల నుంచి సాధించుకున్న స్వాతంత్య్రానికి పరిపూర్ణత సిద్ధించిన రోజు... కుల, మత, ఆర్థిక భేదాలకతీతంగా భారతీయులందరికీ హక్కులు దఖలుపడ్డ రోజు... దేశ నవీన చరిత్ర ప్రారంభమైన రోజు... జనవరి 26, 1950. అదే గణతంత్ర దినోత్సవం. రాజ్యాంగం ఇచ్చిన దన్నుతో ‘మనిషి మనిషిగా బతికే రోజు... పూర్తి పాఠం..
జీవితం చిత్రమైంది . కష్టసుఖాలు, సుఖదుఃఖాలు. లాభనష్టాలు. ప్రేమలు, వైఫల్యాలు... ఇలా ఎన్నో ఆటుపోట్లు సంఘర్షణలతో రంగుల హరివిల్లులా సాగిపోతూంటుంది. మనసు, శరీరం, ఆత్మ కూడా సంగీతానికి, పాటకు స్పందిస్తాయంటారు. చిన్నపాటి సంతోషానికి మనసు తనలో తాను సన్నగా పాట పాడుకోవాలని ఆరాటపడుతుంది. కొందరు గొంతెత్తి పాడితే పూర్తి పాఠం..
పులకించని మది పులకించు
మనసుకు నచ్చింది చేసినప్పుడు.. అలాంటి సందర్భాలు తారసపడినప్పుడు భావాలు ప్రఫుల్లమవుతాయి. ఎన్నాళ్ల నుంచో చెప్పాలనుకుని మనసు విప్పలేక అణచి పెట్టుకున్న ఊసులన్నీ పాటలోకి తర్జుమా అయిపోతాయి. ఆ గీతోద్యానవనంలో ఆనందవిహారిలా తిరుగాడుతూ గొంతెత్తి పాడే ప్రతి పల్లవీ, చరణమూ మనసు అనుభూతి చిత్రణకు ప్రతీకలవుతాయి. పూర్తి పాఠం..
వెండితెర కల్పవృక్షాలు.. పద్యనాటకాలు
పద్యనాటకాలు తెలుగు చలనచిత్రాలకు పునాదులు వేశాయి. పద్య ఆలాపనలో ఆరితేరిన దిగ్గజాలు బళ్లారి రాఘవ, వేమూరి గగ్గయ్య, బందా కనకలింగేశ్వరరావు, గోవిందరాజుల సుబ్బారావు, ధూళిపాళ, మిక్కిలినేని లాంటి వారంతా సినీరంగంలోకి అడుగుపెట్టి, దాన్ని సుసంపన్నం చేశారు. పూర్తి పాఠం..
ఓహో గులాబి బాల..
ప్రేమంటే ఒక తాజ్మహల్, ఒక హృదయం చిహ్నం, ఒక ప్రేమలేఖ... మరీ ముఖ్యంగా ఒక గులాబీ కూడా. రోజా లేని ప్రేమ వాసన లేని పువ్వు లాంటిదే. ప్రేమను తెలపాలన్నా, తీయని వలపు పండాలన్నా గులాబీ కావాల్సిందే. పూర్తి పాఠం..
కొండలను, అడవులను దిగమింగిన అనకొండలు... భూములతో పాటు బడుగుల బతుకులనూ తన్నుకుపోయిన గద్దలు... పుడమి తల్లి కడుపు చీల్చి ఖనిజాలను కరకరలాడించిన హైనాలు కొన్ని ఖద్దరేసుకుని కాశీమజిలీ కథలు చెబుతున్నాయి. మాటలతో మభ్యపెట్టి వెన్నులో కత్తి దించే కుట్ర చేస్తున్నాయి. సోదరా... జర జాగ్రత్త! పూర్తి పాఠం..
వెన్నెల రోజు ఇది వెన్నెల రోజు... అమావాస్య నాడు వచ్చే పున్నమి రోజు... చంటిపాప నవ్వులకు పువ్వులు విరిసే రోజు... మింటనున్న తారకలు ఇంటింటా వెలిగే రోజు... దీపావళి పేరెత్తగానే సహజకవి మల్లెమాల ఇలా కలమెత్తుకుంటారు! పూర్తి పాఠం..