అమ్మభాషకు గొడుగు గిడుగు
పి.స్నేహలతా మురళి
అందరి గొడవ కాళోజీ గొడవ!
ఎ.సుబ్రహ్మణ్యం
పలుకే పద్య మాయెరా!
మాశర్మ
తెలుగువారి ఠాగూర్ సంజీవదేవ్
వెనిగళ్ల వెంకటరత్నం
స్వరాజ్య పోరాటంలో తెలుగు వెలుగులు
ఇడమకంటి లక్ష్మీరెడ్డి
తెలుగు తల్లికి తేటగీతి
మందలపు నటరాజ్
స్వాప్నికా భావనా విరించి
‘‘నాకు రెండు నిధులున్నాయి. నాలుక మీద కవిత్వం, తలమీద దారిద్య్రం. నాకు రెండు విధులున్నాయి. కవిత్వ నిత్య నిబద్దం, దారిద్య్ర విముక్తి యుద్ధం’’ అని జీవితాన్ని విలక్షణంగా చూసిన దేవీప్రియ అసలు పేరు ఖ్వాజా హుస్సేన్. పూర్తి పాఠం..
నిత్య చైతన్య సాహిత్య వారధి
ప్రసిద్ధ కథా రచయిత కొడవటిగంటి కుమార్తె.. అనువాద రంగంలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆర్.శాంతసుందరి 1947లో మద్రాసులో జన్మించారు. తల్లి వరూధినికి ప్రముఖ రచయిత చలం స్వయాన పెదనాన్న. సాహితీ కుటుంబంలో మసలడం వల్ల చిన్నతనంలోనే చదవడం, రాయడం అనేవి ఆవిడకు నిత్యవ్యాపకాలయ్యాయి. పూర్తి పాఠం..
ఒంటరి విలుకాడి ఉద్యమ నినాదం
వచన కవితకి ఆయనే ఉద్యమ నినాదమయ్యారు. సంప్రదాయ పద్యవేదిక మీద వచన కవితకి పట్టం కట్టారు. భాషలోనూ, భావంలోనూ నవ్యత కోసం ఆరాటపడ్డారు. కవిత్వం ఏ రూపంలో ఉన్నా, సామాన్యుడి పక్షం వహించాలని ఆశించారు. కొనఊపిరితో అల్లల్లాడుతున్న వచనకవితకి ప్రాణప్రతిష్ఠ చెయ్యడం వెనుక కుందుర్తి కృషి ఎంతటిదో చూద్దాం! పూర్తి పాఠం..
గద్వాల నుంచి చెన్నపట్టణం వరకూ కవితా జైత్రయాత్ర చేసి ‘తెలుగువాడ’ంటే ఏంటో లోకానికి చూపించారు... కొన్ని వేల అష్ట, శతావధానాలతో ఎక్కడికక్కడ తెలుగు పద్యానికి గండపెండేరాలు తొడిగించారు... అనితరసాధ్యమైన వేగంతో అద్వితీయమైన సాహిత్యాన్ని సృష్టిస్తూ తెలుగుతల్లి నుదుటి తిలకాలై మెరిశారు... వారే కొప్పరపు కవులు. పూర్తి పాఠం..
ఈ తరం వారికి ఒకటి రెండు మాటల్లో సంజీవదేవ్‌ని పరిచయం చెయ్యాలంటే ‘సంజీవ్‌దేవ్ ‘కళాతాత్త్వికుల్లో తెలుగు వారి రవీంద్రనాథ్ ఠాగూర్, మరో ఆనందకుమార స్వామి’ అని బెజవాడ గోపాల్‌రెడ్డి అన్న మాటలు గుర్తు చేసుకోవాలి. రవీంద్ర సాహిత్యాన్ని ఆకళింపు చేసుకున్న గోపాల్‌రెడ్డి మాటలు అక్షరసత్యాలు. పూర్తి పాఠం..
శంకరంబాడి సుందరాచారికి పర్యాయపదంగా నిలిచేది ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతం. అయితే ఇదొక్కటే ఆయన రచన కాదు. ఆయన పదులకొద్దీ పుస్తకాలు రాశారు. ఎన్నో సన్మానాలు అందుకున్నారు. ఆయన జీవిత విశేషాలు... పూర్తి పాఠం..
జాతీయోద్యమ సమరంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో బ్రిటిష్ వ్యతిరేకత ప్రధానం కాగా, తెలంగాణలో నిజాం నవాబుపై తెలంగాణ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలవారు చేసిన పోరాటం ప్రధానంగా నిలిచాయి. పూర్తి పాఠం..
చిలుకూరి వారిది సామెతల యజ్ఞం!
కొంతమంది ఉంటారు... తాము అనుకున్నది సాధించాక కానీ నిద్రపోరు. ఎన్ని ఆటంకాలు, వ్యయ ప్రయాసలెదురైనా సరే విశ్రమించరు. తెలుగులో ఎన్ని సామెతలు ఉన్నాయో ఇంతని లెక్క తెలియదు. ఆయన మాత్రం లక్షా యాభైవేల సామెతలు సేకరించాలని ప్రతిన పూనాడు. పూర్తి పాఠం..
తెలుగువారి ఆస్తి పద్యనాటకం
తెలుగు నాటక రంగానికి మరోపేరు ‘సురభి’! 129 సంవత్సరాల ఘన చరిత్ర సురభిది. జీవిక కోసం కళ, దానికోసం సంచార జీవనం... వెరసి సురభి కుటుంబం! అలాంటి కుటుంబం నుంచి ఎదిగి తనతోపాటు తనవాళ్లనూ సుశిక్షితులైన నటులుగా తీర్చిదిద్దిన వ్యక్తి సురభి బాబ్జీ (రేకందార్ నాగేశ్వరరావు). పూర్తి పాఠం..