ఏప్రిల్ 2017
తెలుగువాడా కళ్లు తెరు!
ఇంటి నుంచే ఆరంభిద్దాం!
అచ్చతెలుగు బతికే ఉందక్కడ!
తెలుగువాళ్లు కాబట్టే మనకు లోకువ
మహమ్మద్ అన్వర్
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని...
శ్రీసత్యవాణి
తల్లిభాషను తలమీద పెట్టుకోవాలె
తెలుగు వెలుగు బృందం
పార్లమెంట్లో తెలుగు వినపడాలి
ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు అసలే కనిపించదన్నది చాలా మంది అనుకునే మాట. కర్నూలు జిల్లా శ్రీశైలం భూసేకరణ విభాగంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ నూర్బాషా రహంతుల్లా లాంటివారు ఈ అభిప్రాయానికి మినహాయింపుగా నిలుస్తారు.
మనిషి మాతృభాషలో మాట్లాడితే మట్టి వాసనొచ్చినట్లుంటది. సరిగ్గా గదే అనిపిస్తది అందెశ్రీతో ముచ్చట్లువెడితే. ఎంతసేపు మాట్లాడిన ఆయన జెప్పెటిదేమిటి? మన భాష మన నోట్లనే ఉంటది. తల్లి చనుబాలెంతనో మనకు మన భాషంతే... మన యాసంతే. అంటడు. ‘తెలుగు వెలుగు’తో అందెశ్రీ జెప్పిన ముచ్చట్లన్నీ ఒక్కపారి మీరుగూడ వినుండ్రీ...
కొత్త మాటల్ని వాడటానికి మీరెవరు?
యూదులు తమ స్వస్థలాన్ని వదిలి ప్రపంచం నలుమూలలకూ చెదిరిపోయారు. కానీ, వాళ్ల భాషను, సంస్కృతిని కాపాడుకున్నారు. మనం ఎక్కడికీ పోకుండానే తెలుగు మర్చిపోతున్నాం.
వద్దు బాబోయ్! ‘బొన్సాయి సంగీతం’
ఉపాధ్యాయుడు, నాటక రచయిత, పాత్రికేయుడు, చలనచిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు... బహుముఖ ప్రజ్ఞకు పర్యాయపదం సింగీతం శ్రీనివాసరావు. అర్ధ శతాబ్దపు చలనచిత్ర ప్రయాణంలో ఆణిముత్యాల్లాంటి ఎన్నో వెండితెర కావ్యాలకు రూపమిచ్చిన సృజనశీలి ఆయన. భాషా సంస్కృతులంటే ప్రాణం పెట్టే సింగీతం...
ఈ ‘ఆనందం’ అనిర్వచనీయం
పిల్లలకి మొదటి బడి తల్లి, ఆ తరువాత తండ్రి, తరువాత ఉపాధ్యాయుడు... వీళ్లందరూ కలిసి ఎంత చెబుతారో.. అంతకు కొన్ని రెట్లు ఒక పుస్తకం చెబుతుంది. పిల్లవాడు బాలసాహిత్యానికి కనుక అలవాటు పడితే... వింటిని సంధించి వదిలిన బాణంలాగా, అతని ఎదుగుదల అనంతంగా సాగుతుంది.
జీవితాన్నిచ్చే భాషకావాలి
ఆర్థిక వ్యవస్థతో తెలుగును అనుసంధానించుకోకపోతే, మన మాతృభాష తన అస్తిత్వాన్ని కోల్పోవడానికి మరెంతో కాలం పట్టదని హెచ్చరిస్తున్నారు కన్నెగంటి అనూరాధ. ఉత్పాదకతే (ప్రొడక్టివిటీ) భాషకు బతుకునిస్తుందని చెబుతున్నారావిడ.
నిరాడంబరుడు... నిగర్వి
పిల్లల్ని భయపెట్టి చెప్పిన మాట వినేట్టు చేయడం, లేకపోతే గారాబం చేసి వాళ్లు ఆడించినట్టు ఆడటం, రెండూ తప్పే అన్నది మా నాన్న కొడవటిగంటి కుటుంబరావు గారి అభిప్రాయం.
రెండు ప్రభుత్వాలకూ భాషావిధానం లేదు!
‘నిరంతరం కవిత్వం కోసం జీవించడమే నా భవిష్యత్తు. మంచి సమాజాన్ని సృష్టించడానికి.. మంచి సాహిత్యం రచించడం, ప్రచారం చేయడమే జీవితంగా సాగిపోతాను’ అని చెప్పే కవి నందిని సిధారెడ్డి. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘విశిష్ట సాహితీ పురస్కారం’ అందుకున్న ఆయనతో ‘తెలుగు వెలుగు ముఖాముఖి...
మాతృభాష పరిరక్షణ తమ ప్రథమ కర్తవ్యంగా పౌరులు భావించాలి. తల్లి భాష ఇంటివద్ద తల్లిదండ్రుల నుంచే మొదలుకావాలి. మనమంతా తప్పనిసరిగా మన పిల్లలకు తెలుగు భాష పట్ల మమకారం కలిగేలా ఇంట్లో వాతావరణం కల్పించాలి. పౌరులుగా ఇది మనందరి బాధ్యత. - పద్మశ్రీ శోభానాయుడు, ప్రముఖ కూచిపూడి కళాకారిణి