ఏప్రిల్ 2017
తెలుగువాడా కళ్లు తెరు!
ఇంటి నుంచే ఆరంభిద్దాం!
అచ్చతెలుగు బతికే ఉందక్కడ!
తెలుగువాళ్లు కాబట్టే మనకు లోకువ
మహమ్మద్ అన్వర్
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని...
శ్రీసత్యవాణి
తల్లిభాషను తలమీద పెట్టుకోవాలె
తెలుగు వెలుగు బృందం
వైజ్ఞానిక రచనలే తెలుగుకు రక్ష
డాక్టర్ శ్రీనివాస చక్రవర్తి... మద్రాసు ఐఐటీ న్యూరో సైన్సు ఆచార్యులు. వృత్తిజీవితంలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ విజ్ఞానశాస్త్రాన్ని తేట తెలుగులో ప్రచారం చేయాలన్న లక్ష్యం ఆయనది. అందుకే, వివిధ భాషల్లోని పుస్తకాలను తెలుగులోకి అనువదిస్తున్నారు. ‘శాస్త్రవిజ్ఞానం’ పేరిట ఓ బ్లాగునూ నిర్వహిస్తు న్నారు.
మహిళా స్పృహ సాధించాం!
స్త్రీవాద రచయిత్రిగా, ఉద్యమకారిణిగా ఓల్గా అలుపెరగని కృషి చేస్తున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న సందర్భంగా ఆమెతో ‘తెలుగువెలుగు’ ముఖాముఖి...
అమ్మ భాషతోనే గెలిచా!
అఖిల భారతస్థాయిలో మూడో ర్యాంకు సాధించిన ఈ తెలుగుతేజంతో ‘తెలుగు వెలుగు’ మాట్లాడింది. వ్యక్తి సర్వతోముఖాభివృద్ధిలో అమ్మభాష పోషించే గణనీయమైన పాత్రను వివరిస్తూ గోపాలకృష్ణ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...
వారిజ నయన నీవాడను నేను!!
సంగీత కళాశిఖామణి, పద్మవిభూషణ్ డి.కె.పట్టమ్మాళ్ ఆ యువకుడి(చాంగ్ చియు సెన్)కి పెట్టిన పేరు సాయి మదన మోహన కుమార్. ఇటీవల హైదరాబాదుకు వచ్చిన చాంగ్తో ‘తెలుగు వెలుగు’ముఖాముఖి...
తేలికైన తెలుగు... కంప్యూటర్కు వెలుగు
బ్లాగు రచనలు, వీడియో పాఠాల ద్వారా సాంకేతిక సమాచారాన్ని అమ్మభాషలో అందిస్తున్న వృత్తినిపుణుడాయన. వైజ్ఞానిక అంశాలను తెలుగులో వివరించేటప్పుడు సరళతే ప్రధానమనే నల్లమోతు శ్రీధర్తో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి..
రెండే మంత్రాలు.. గురువుల శిక్షణ! శిష్యుల క్రమశిక్షణ!!
కాలం ఒరిపిడికి కుదేలవుతున్న పద్యనాటకాలను కాపుగాయడానికి అహరహం శ్రమిస్తున్న గుమ్మడి గోపాలకృష్ణకు 2016 సంవత్సరానికి గానూ ‘ఎన్టీ రామారావు రంగస్థల పురస్కారం’ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ సందర్భంగా ఆయనతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...
చారిత్రక స్పృహే సంస్కృతికి శ్రీరామ రక్ష
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పురావస్తు పరిశోధనల్లో డీఎన్ఏ ఆధారిత అధ్యయనం జరుగుతోంది. ఈ ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు విశాలాచ్చితో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...
రేపటికి దారి చూపించేది చరిత్రే
సొగసు చూడతరమా, రామాయణం, చూడాలని ఉంది, మనోహరం, ఒక్కడు, వరుడు, నిప్పు... ఇలా గుణశేఖర్ తీసిన ప్రతి సినిమా పేరూ తెలుగులోనే ఉంటుంది. ఆ సినిమాల్లోనూ తెలుగుదనమే కనిపిస్తుంది. ఇక ‘రుద్రమదేవి’తోనైతే మహోన్నత తెలుగు మహారాజ్ఞి జీవిత చరిత్రను వెండితెర అద్భుతంగా ఆవిష్కరించారు.
ఉగాది మా జాతీయ పండుగ
‘సొంతగడ్డను వదిలిపెట్టి శతాబ్దాలు గడిచిపోయినా, మేము సొంతభాషను, సంస్కృతిని మాత్రం మర్చిపోలేదు’’ అంటూ ‘మారిషస్ తెలుగు మహాసభ’ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న నారాయణస్వామితో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...