ఏప్రిల్ 2017
తెలుగువాడా కళ్లు తెరు!
ఇంటి నుంచే ఆరంభిద్దాం!
అచ్చతెలుగు బతికే ఉందక్కడ!
తెలుగువాళ్లు కాబట్టే మనకు లోకువ
మహమ్మద్ అన్వర్
వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని...
శ్రీసత్యవాణి
తల్లిభాషను తలమీద పెట్టుకోవాలె
తెలుగు వెలుగు బృందం
అక్షరమంటే.. మాటంటే.. భాషంటే ఇష్టం
కొంతమందికి పరిచయాలు అక్కర్లేదు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యానికి కూడా ఆ అవసరం లేదు.. రాదు. యాభై ఏళ్లుగా ఓ జీవనదిలా ప్రవహిస్తున్న బాలు పాటకు ఆసేతుహిమాచలమంతా అభిమానులే. సాహిత్యాన్ని అర్థం చేసుకుని.. పాట ఆత్మను ఆవాహనం చేసుకుని ఆలపించే అరుదైన గాయకుడిగా ఆయనది ఓ ప్రత్యేక పథం.
పల్లవించే పల్లె జీవితమే నా తొలిగురువు
భూమిలో ఉన్నప్పుడు అవి రాళ్లే! సానపెట్టిన తర్వాతే అవి విలువైన వజ్రాలవుతాయి. ప్రస్తుతం గురువుగా రామాచారి చేస్తోంది ఇదే. వినసొంపైనగాత్రం ఎక్కడున్నా వెలికితీయడం, సంగీత ప్రపంచంలో వారిని వజ్రాలుగా తీర్చిదిద్దడం. ఆయన ప్రారంభించిన లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీవేలమంది గాయనీగాయకులనిప్రపంచానికి పరిచయం చేసింది.
కీరవాణి సరిగమలు...!
పలకరింపుల్లో సైతం ‘హాయ్’ అంటూ తెలుగు వచ్చికూడా తెలుగులో మాట్లాడటానికి సిగ్గుపడేవాడు, తెలుగు వాడినని చెప్పుకోవడాన్ని చులకనగా భావించేవాడు.. నేను ఫలానా వారి కడుపున పుట్టాను... అని చెప్పుకోలేని బతుకు బతుకుతున్నట్టు. (కాదు.. బతికీ చచ్చినట్టు)
చేతులు కలపాలి... చేవ చూపాలి
అద్దాన్నీ ఆకారాన్నీ విభజించలేనట్లే జీవితాన్ని, కవిత్వాన్నీ వేరు వేరుగా దర్శించలేకపోతున్నానని చెప్పుకున్న ఆ కవి... అన్నట్లుగానే జీవితాన్నే కవిత్వంగా రాశాడు. ముఖ్యంగా పేదోడి జీవితాన్ని కవితా వస్తువు చేశాడు. ఆయనే జూకంటి జగన్నాథం. కథకుడు కూడా అయిన ఆయనతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...
కాలక్షేపం కథలన్నీ కాలగర్భంలోకే!
తెలంగాణ వెనకబడిన తరగతుల కమిషన్ తొలి అధ్యక్షులు బేతి శ్రీరాములు. బీఎస్ రాములుగా సాహితీలోకానికి సుపరిచితులు. అనేక కథలు, నవలలతో పాటు సామాజిక రచనలనూ సృజించారు. లోతైన అధ్యయనం, విభిన్న కోణాల నిశిత పరిశీలన, ప్రత్యక్ష జీవితానుభవం, నిర్దిష్టావగాహన సూత్రాలకు రచనా సామర్థ్యం కలగలసిన సాహితీవేత్త.
నేను తెలుగు పిచ్చివాణ్ని...!
ప్రతినాయకుడిగా భయపెట్టినా... హాస్యనటుడిగా నవ్వించినా జయప్రకాష్‌రెడ్డి మాటల్లో మనదైన మట్టివాసన గుబాళిస్తుంది. తెలుగునాట ఏ యాసనైనా, మరే మాండలికాన్నైనా తన గొంతులో అవలీలగా పలికించగల సామర్థ్యం ఆయన సొంతం. ‘‘నేను తెలుగు పిచ్చివాణ్ని’’ అని సగర్వంగా చెప్పుకునే జయప్రకాష్‌రెడ్డితో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...
సమాజాన్ని చదివి రాయండి!
వైవిధ్యం... జీవితం పట్ల పరిశీలనా దృష్టి... చిన్న చిన్న పాత్రల మానసిక స్థితిని సైతం పట్టివ్వగల రచనా నైపుణ్యం... భాషను పొదుపుగా వాడుతూ, భావాన్ని పదునుగా చెప్పే లక్షణం... ‘అంపశయ్య’ నవీన్ కథలు, నవలల్లో ఇవన్నీ కనిపిస్తాయి. ఈ సాహితీ శ్రామికుడితో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...
ధిక్కరణతోనే భాష బతుకుద్ది!
కన్నీరు పెడుతున్న పల్లె రూపాన్ని కళ్లకు కట్టినా... మందెంట పోతున్న యలమంద గురించి చెప్పినా... తెలంగాణ గుండె గోసకు తన గొంతుక అరువిచ్చినా... పైరూ పిట్టా, చెట్టూ పుట్టా, వాగూ వంకా దేనిమీద పాడినా... ఆ పాటలో గోరటి వెంకన్న ముద్ర స్పష్టంగా కనపడుతుంది. ఆయనతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...
వారి సాంగత్యం నుంచే నా సాహిత్యాభిలాష
కాశీనాథుని విశ్వనాథ్. ‘శంకరాభరణం’ చిత్రంతో విశ్వఖ్యాతి గాంచిన తెలుగు జాతి కీర్తి తటాకంలో విరిసిన ‘స్వర్ణకమలం’. సంగీత సాహిత్య సమలంకృతంగా తెలుగు సినిమాను సుసంపన్నం చేసిన ఆయనతో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...