గోడకు కొట్టిన మేకులు

  • 1991 Views
  • 8Likes
  • Like
  • Article Share

గోడకు కొట్టిన మేకులు

డుక్కి ఆ తండ్రి కొన్ని మేకులు ఇచ్చి.. ‘‘నీకు రోజుకి ఎంతమంది మీద కోపమొస్తుందో అన్ని మేకులు గోడకు కొట్టు’’ అన్నాడు.
      మొదటి రోజు ఇరవై, తర్వాత రోజు పదిహేను... ఇలా మేకులన్నీ గోడకు కొట్టేశాడు కొడుకు. ‘‘నాన్నా మీరిచ్చిన మేకులన్నీ అయిపోయాయి’’ అంటూ తండ్రి దగ్గరికి వచ్చి చెప్పాడు. ‘‘ఓ... అంటే నీకు చాలా మంది మీదే కోపం వచ్చిందిరా’’ అన్నాడు తండ్రి. అయితే రేపటి నుంచి రోజుకు కొన్ని చొప్పున ఆ గోడ నుంచి నువ్వు కొట్టిన మేకులు తీసెయ్‌’’ అన్నాడు. 
నాన్న చెప్పినట్టే కష్టపడి గోడకు కొట్టిన మేకులన్నీ తీసేశాడు కొడుకు. వాటిలో కొన్ని తొలగించడానికి చాలా కష్టపడ్డాడు. 
      ‘‘ఏమయ్యిందిరా?’’ అని అడిగాడు కొడుకుని తండ్రి. ‘‘అన్నీ తీసేశాను నాన్నా.. కానీ, వాటితో గోడకు అయిన రంధ్రాలు మాత్రం అలాగే ఉన్నాయి’’ అన్నాడు కొడుకు.
      ‘‘చూశావా.. మేకులు కొట్టేటప్పుడు సులువుగా కొట్టేశావు. తీసేటప్పుడు కష్టపడ్డావు. ఎలాగో తిప్పలు పడి మేకులు తీసేసినా రంధ్రాలు అలాగే ఉండిపోయాయి. అంటే మనకి చాలామంది మీద కోపం వస్తుంటుంది. ఆ కోపంలో వాళ్ల మనసులను గాయపరుస్తాం- అంటే మేకులు కొడతాం, ఆవేశం తగ్గాక ‘సారీ’ అనేస్తాం-  అంటే కొట్టిన మేకులు తీసేస్తాం. కానీ, అంతమాత్రాన వారి మనసులకు తగిలిన గాయాలను- అంటే గోడ మీది రంధ్రాలను మాత్రం పూడ్చలేం. అందుకే కోపాన్ని నిభాయించుకోవాలి. మాటల మీద అదుపుండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దవాళ్లు అనేది అందుకే రా’’ అన్నాడు తండ్రి. 

సేకరణ: పోలయ్య, కూకట్లపల్లి, హైదరాబాదు.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు