సందేశం

  • 1955 Views
  • 4Likes
  • Like
  • Article Share

సందేశం

రూ.కోట్ల ఖరీదు చేసే తన బెంట్లీ కారును పాతిపెట్టేయబోతున్నానంటూ బ్రెజిల్‌కు చెందిన ఓ కోటీశ్వరుడు పత్రికా ప్రకటన ఇచ్చాడు. ఫలానా రోజు... ఫలానా సమయానికి దాన్ని సమాధి చేయబోతున్నాని చెప్పాడు. 
      ఇంకేముంది! అందరూ అతన్ని ‘పెద్ద అవివేకి’గా జమకట్టేశారు. ‘అంత విలువైన కారును ఇలా మట్టిపాలు చేసే బదులు ఎవరికైనా ఇవ్వొచ్చు కదా’ అని కొంతమంది సలహాలూ ఇచ్చారు. ప్రసారమాధ్యమాలు కూడా అతని వింత ప్రకటన గురించి కథనాలు ఇచ్చారు.  
      ఆ వ్యక్తి తన మాట ప్రకారం కారును పాతిపెట్టేందుకు పెద్ద గొయ్యి తవ్వించాడు. ఆ రోజు అక్కడికి జనం కూడా భారీగా వచ్చారు. ‘ఎందుకీ పిచ్చిపని చేస్తున్నావు? చనిపోయిన తర్వాత ఇదెలా ఉపయోగపడుతుందయ్యా నీకు? కావాలంటే దీన్ని అమ్మేసి పేదవారికి దానం చేయవచ్చు కదా!’ అంటూ ఆ వ్యక్తిని కడిగేశారు. అతను చిరునవ్వుతో ఇలా చెప్పుకొచ్చాడు...  
      ‘‘డబ్బు పోస్తే వచ్చే కారు కోసం మీరెంత బాధ పడుతున్నారే... మరి ఎంత డబ్బు పెట్టినా దొరికని మానవ అవయువాలు వృథాగా మట్టిపాలైపోతుంటే ఎవరూ ఎందుకు మాట్లాడరు? అవయువ దానం గురించి ఎందుకు పట్టించుకోరు? గుండె, కళ్లు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు ఇలా శరీరంలోని ప్రతి అవయవమూ, మన తదనంతరం మరొకరికి ఉపయోగపడుతుంది కదా. దానిగురించి ఎందుకు ఆలోచించరు? ప్రాణాపాయ స్థితిలో ఉండి అవయవ దానం  చేసే ధర్మాత్ములకోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. వారికి సాయం చేద్దాం. అవయవ దానానికి నడుంబిగిద్దాం. తోటివారిలోనూ దీనిమీద అవగాహన పెంచుదాం. ఏమంటారు!? ఈ విషయాన్ని మీకు చెబుదామనే నేను ఇలా చేశాను. తప్పయితే మన్నించండి’’  

* * *

      పెద్దలమాట ఒకటి గుర్తుందా... ‘పరోపకారార్థ మిదం శరీరం’!

సేకరణ - రజిత, వరంగల్లు

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు