నాన్న

  • 1815 Views
  • 10Likes
  • Like
  • Article Share

నాన్న

రమేష్‌ ఓ దర్జీ కొడుకు. బీటెక్‌ చదువుతున్నాడు. చాలా నిస్పృహలో ఉన్నాడు. తనకంటే తక్కువ మార్కులు తెచ్చుకుంటున్న స్నేహితులకు స్మార్ట్‌ఫోన్లు, బైకులు ఉన్నాయి. తనకు కనీసం ఓ మంచి ఫోను కూడా లేదు. స్నేహితులు చులకనగా చూస్తున్నారు. తన కనీస అవసరాలు తీర్చలేని నాన్నకు పెళ్లెందుకు, పిల్లలెందుకు?... అని తిట్టుకుంటున్నాడు.   ఏమీ లేకుండా బతికేకంటే చావడమే మంచిదనుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకుని గదిలోంచి బయటికి వస్తుంటే అమ్మానాన్నల మాటలు వినపడుతున్నాయి...
      ‘‘బాగా దగ్గుతున్నారు. ఓసారి ఆస్పత్రికి వెళ్లిరాకపోయారా?’’  
      ‘‘డాక్టర్‌ని కలిశాను... టీబీ అన్నారు. వైద్యానికి పది పదిహేను వేలవుతాయట’’  
      ‘‘ఈ నెల్లో చీటీ వస్తుంది కదా. ఆ డబ్బుతో...’’ 
      ‘‘వాటితో అబ్బాయికి ఫోన్‌ తీసుకోవాలి’’ 
      ‘‘మీ ఆరోగ్యం కంటే అది ముఖ్యమా?’’
      ‘‘నీకు నేను ముఖ్యం. నాకు వాడు ముఖ్యం. వాడి కోర్కెలేవీ తీర్చలేకపోతున్నాం. కనీసం ఇదైనా తీసుకుందామని..’’
      ‘‘మరి మీ ఆరోగ్యం?’’
      ‘‘మనకింకెన్నాళ్లే కష్టాలు? ఇంకో రెండేళ్లలో వాడి చదువు పూర్తవుతుంది. ఉద్యోగం వస్తే మనల్ని కాలు కిందపెట్టనిస్తాడా...’’ 
      రమేష్‌ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ‘నీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నాకు ఫోన్‌ కొందామనుకున్నావా? మరి నేనేమో నిన్ను వదిలేసి చచ్చిపోదామనుకున్నాను. నాకు ఫోన్‌ వద్దు... ఏమీ వద్దు. బాగా చదువుకుని క్యాంపస్‌ ఉద్యోగం సాధిస్తా... నిన్ను మహారాజులా చూసుకుంటా’ అనుకుంటూ గదిలోకి వెళ్లిపోయాడు. 

సేకరణ: గంపల పవన్‌కుమార్‌
మనులాలపేట, నెల్లూరు జిల్లా

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు