నిజమైన స్నేహితులు

  • 444 Views
  • 0Likes
  • Like
  • Article Share

నిజమైన స్నేహితులు

కొడుకు తన తండ్రి దగ్గరకొచ్చి, ఒక లిస్టు చూపిస్తూ ‘‘నాన్నా! ఈ జాబితాలో ఉన్న యాభై మందీ నా స్నేహితులు! వీళ్లని నా పెళ్లికి తప్పకుండా పిలవాలి’’ అన్నాడు.
‘‘సరే, వీళ్లందరినీ స్వయంగా నేనే ఆహ్వానిస్తాను. నువ్వు మిగిలిన పనులు చూసుకో’’ అని చెప్పాడు తండ్రి.
పెళ్లి ముహూర్తం సమీపించింది. మండపంలో చూస్తే అతని స్నేహితులు పది మంది మాత్రమే కనిపించారు. వెంటనే కొడుకు తండ్రి దగ్గరికెళ్లి, ‘‘నాన్నా! నేను మీకు యాభై మంది జాబితా ఇచ్చాను కదా! పదిమందే ఉన్నారేంటి? మిగిలిన వాళ్లని మీరు పిలవలేదా!’’ అని అడిగాడు. 
‘‘నువ్విచ్చిన జాబితాలో ఉన్న వాళ్లందర్నీ నేను పిలిచాను. కానీ, నీ పెళ్లి అని చెప్పలేదు. ‘నా కొడుకు పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. అతనికి సహాయం చెయ్యాలంటే, ఈ సమయానికి రండి’ అని చెప్పాను. ఇప్పుడు వచ్చిన వాళ్లంతా నీ నిజమైన స్నేహితులు. మిగిలిన వాళ్లు స్నేహం ముసుగులో ఉన్న పరిచయస్థులు మాత్రమే’’ అని చెప్పాడు తండ్రి.
కేవలం మన ఆనందంలోనే కాదు, బాధలోనూ మన పక్కనుండి భరోసా ఇచ్చేవాళ్లే నిజమైన స్నేహితులు.

- సేకరణ: జంపన తులసీ బృంద 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  వాట్సప్ కథలు